Budget 2026: ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు

Read Time:  1 min
Budget 2026: ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
FONT SIZE
GET APP

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Budget 2026) ను సీఎం చంద్రబాబు, ‘ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్’ అని ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. టెక్నాలజీ, ఏఐని దేశం వేగంగా అందిపుచ్చుకుంటోందని, దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించారని తెలిపారు.

Read Also: AP: TTD ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్ బదిలీ

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానానికి మరింత ఊతం

పౌరుల జీవనశైలిని మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందని, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, హైదరాబాద్‌-చెన్నై కారిడార్లు ఎంతో ప్రయోజనకరమని, అరుదైన ఖనిజాల వెలికితీతతో ఏపీకి లాభం చేకూరుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానానికి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి తాము ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా కేంద్రం 75 శాతం క్రెడిట్ గ్యారెంటీ ఇవ్వడం,

This is a forward-looking budget: CM Chandrababu
This is a forward-looking budget: CM Chandrababu

రాష్ట్రం తరఫున మరో 20 శాతం అందిస్తుండటంతో ఈ రంగానికి భరోసా లభిస్తుందని తెలిపారు. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా ఈ బడ్జెట్ ఉందని, ఇది 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’గా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు బలమైన పునాది వేస్తుందని అన్నారు. ఆర్థిక మంత్రి సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, దేశానికి సరైన దిశానిర్దేశం చేసేలా ఉందని కొనియాడారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.