సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం
తిరుమల: శేషాచలంకొండల్లో వెలసిన కలియుగవైకుంఠం తిరుమల (Thirumala) పవిత్ర పుణ్యక్షేత్రంలో మూడున్నరకోట్ల పుణ్యతీర్థాల్లో తుంబురుతీర్థం పుణ్యస్నానాలకు సాధారణ రోజుల్లోనూ భక్తులను అనుమతించే విషయంపై చర్చ మొదలైంది. ఈ పుణ్యతీర్థం తిరుమల రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఉండటంతో సాధారణ రోజుల్లో భక్తులను అనుమతించడంలేదు. సప్తగిరులపై ప్రకృతి సిద్ధంగా వెలసిన తీర్థాలలో ఏడుతీర్థాలు అత్యంత పవిత్రమైనవిగా ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య ముక్తి ప్రదాయాన్ని కలిగిస్తాయని ప్రగాఢ విశ్వాసం. శ్రీవారిపుష్కరిణి, రామకృష్ణ తీర్థం, ఆకాశగంగ, పాపవినాశనం, కుమారధార, తుంబురుతీర్థం, పాండవతీర్థం ఈ పుణ్యతీర్థాల్లో ఏడాదికోసారి మాత్రమే కొన్ని పుణ్యఘడియలు ప్రవేశిస్తాయి. ఈ సమయాల్లో ఆయా తీర్థాల్లో ముక్కోటి ఉత్సవాలు నిర్వహించి, భక్తులు స్నానాలాచరించేలా టిటిడి (TTD) అధికారులు ఏర్పాట్లు చేస్తారు. తుంబురుతీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి ముక్తికలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇదే ప్రగాఢనమ్మకంతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అటవీశాఖ అధికారులతో కలసి రెండునెలల ముందు తుంబురుతీర్థం పర్యటించారు.
Read also: పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు సులభతరం – కొత్త 5 కీలక మార్పులు!
తుంబురుతీర్థం స్నానంతో సకల పాపాలు తొలగుతాయన్న విశ్వాసం
ఈ తీర్థంలో ఉన్న సదుపాయాలు, సాధారణ రోజుల్లోనూ భక్తులను అనుమతించి పుణ్యస్నానాలాచరించేలా చూస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆరా తీశారు. తుంబురుతీర్థ ముక్కోటి మార్చి, ఏప్రిల్ నెలల్లో పాల్గుణ పౌర్ణమి, చైత్ర పౌర్ణమి రోజుల్లోమాత్రమే అనుమతించడం వల్ల చాలామంది భక్తులు తుంబుతీర్థంను సందర్శించలేకపోతున్నారని తెలుసుకున్నారు. ఆ రెండుప్రత్యేక రోజుల్లో సుమారుగా 25వేల మంది వరకు భక్తులు ఈ తీర్థంలో పవిత్ర స్నానాలాచరిస్తారు. రిజర్వుఫారెస్ట్లో ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిటిడి పెద్దఎత్తున ఏర్పాట్లుచేస్తుంది. నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, వైద్యశిబిరాలు వంటివి సౌకర్యాలు కల్పిస్తారు. తీర్థానికి చేరుకునేందుకు సులభంగా అవసరమైన నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటుచేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్తమా, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని తీర్థానికి అనుమతించరు. ఈ నేపధ్యంలో తిరుమలలో పాపవినాశనం జలాశయాంలో ప్రతిరోజూ భక్తులు స్నానమాచరించినట్లే తుంబురుతీర్థంకు అనుమతించే విషయంపై స్వయంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో టిటిడి అధికారులు, అటవీశాఖ నుండి ఎలాంటి సహకారం, అనుమతులు లభిస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. తిరుమల (Thirumala) శ్రీవారి ఆలయానికి ఉత్తరదిక్కున ఉన్న తుంబురుతీర్థంలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని విశ్వాసానికి టిటిడి సహకారం అందిస్తుందనే భక్తులు ఆశిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: