📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదు : గవర్నర్

Author Icon By sumalatha chinthakayala
Updated: February 24, 2025 • 1:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్‌ సోలార్

అమరావతి: 2025-26లో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదని ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ ప్రకటించారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ మాట్లాడుతూ.. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్‌ సోలార్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ ప్రకటించారు.

రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళుతున్నాం

గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందని వివరించారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం నాణేనికి రెండు వైపుల లాంటిదని తెలిపారు. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళుతున్నామని ప్రకటించారు. ఐటీ నుంచి ఏఐ రెవల్యూషన్‌ దిశగా ఏపీ సాగుతోందని వివరించారు. పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ పేర్కొన్నారు.

సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ

మరోవైపు ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాసేపు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ వాకౌట్ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ప్రసంగం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ గవర్నర్ ను వాహనం వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

Ap Breaking News in Telugu electricity charges Google news Google News in Telugu Governor Abdul Nazir Latest News in Telugu no increase Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.