ఉపాధ్యాయుడిని బోధనను విడదీసీ చూడలేము. బోధన అతడి ప్రాథమిక విధి. బోధనలోనే ఉపాధ్యా యుడికి నిజమైన సంతోషం లభిస్తుంది. సమాజమే అతడి సర్వస్వం,పాఠశాల అతడి ప్రపంచం తరగతి గది అతడి తరగని నిధి. విద్యార్థులే విడదీయలేని లోకం. వారి అభి వృద్ధి మాత్రమే అతడి పరమావధి. వారు ప్రయోజకులైతే అతడి సంతృప్తికి అవధులు ఉండవు. అతడి అంతరంగం నిండా విద్యార్థులు నిండి ఉంటారు. ఇలాంటి ఉపాధ్యా యుడు నేడు బోధనకు ఒక రకంగా చెప్తే వృత్తికి కూడా దూరం అవుతున్నాడు. ఇది మనం చూస్తున్న వాస్తవం, చేదు నిజం. ఉపాధ్యాయుడి (The teacher)గా ఎంపిక కావడం ప్రస్తుత పరిస్థితులలో చాలా కష్టమైన విషయం. ఆ వృత్తిని ఇష్టపడి చాలామంది ఎన్నుకుంటున్నారు. కానీ కొద్ది కాలానికి వారు ఆ వృత్తిని వీడిపోతున్నారు. నిరుద్యోగులుగా కూడా ఉండ టానికి జీవితంలో అనిశ్చితిని ఎదుర్కొనడానికైనా వారు సిద్ధపడుతున్నారు కానీ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడంలేదు. రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఏదో అలసట, అసంతృప్తి, నిరాశ వారిని ఆవహించినట్లు స్పష్టం అవుతుంది. ఈ రకమైన పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయో ఒక లోతైన అధ్యయనం చేయవలసి ఉంది. యునెస్కో తన అధికారిక పత్రిక ‘ప్రాస్పెక్ట్స్’ లో విద్యపై జరిగే త్రైమాసిక సమీక్షలో ‘ఉపాధ్యాయులు ఎటు పోతున్నారు?’ అంటూ ప్రశ్నించింది. యునెస్కో ఈ రకమైన ఉపాధ్యాయ వలస ధోరణిని రెండు దశాబ్దాల క్రితమే గమనించింది. ప్రపంచంలోని అనేక ఖండాల్లో జరిపిన సర్వేల్లో గొప్ప అనుభవం ఉన్న ఉపాధ్యాయుల(The teacher)కు ఈవృత్తిపై ఉన్న అసంతృప్తి, ఇందు లోని శూన్యతను గూర్చిన ఫలితాలను చర్చించింది. వారుఈ వృత్తితో రాజీపడలేక రాజీనామా చేస్తున్నారు. ఈ సర్వే ఈ వృత్తిలోని నిశ్శబ్ద సంక్షోభానికి రకరకాల కారణాలను గుర్తించింది. అందులో కొన్ని అంశాలు పాఠశాల తరగతిగది పరిస్థితులకు సంబంధించినవి అయితే మరికొన్ని పాఠశాల లో విద్యార్థి ప్రవర్తనను ప్రభావితం చేసే గృహ వాతావరణం వంటివి. భారతదేశంలో ఈ దిశగా అర్థవంతమైనఅధ్యయనాలేవీ జరిగిన దాఖలాలు లేవు. ఉపాధ్యాయులు ఎంతసేపు తమ వృత్తిపరమైన జీవితాలను ఇబ్బంది పెడు తున్న అంశాల గురించి మాత్రమే చర్చించుతారు. వారి నుండి వచ్చే ముఖ్యమైన ఫిర్యాదు ఉన్న తాధికారుల ఒత్తిడికి, ఆగ్రహానికి తాము నిస్సహాయంగా పనిచేస్తున్నా మని భావన. కొంతమంది ఈ విషయమై తప్పుగా అర్థంచేసుకోవచ్చు.
Read Also : http://Sanatnagar crime: పదో అంతస్తు నుంచి పడి బీటెక్ విద్యార్థిని మృతి
ఒత్తిడి ఆకాంక్షలు
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతాధికారులు ఒత్తిడి ఆకాంక్షలు ఉన్నాయనుకుంటే పొరపాటు, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో యాజమాన్యాల ఒత్తిడి వారికుండే ఫలితాలపై ఆశలు ఉపాధ్యాయులు మనసులపై పనిచేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వృత్తిపరమైన స్వయం ప్రతిపత్తిని కోరుకోవడం అత్యాశ అవుతుంది. అది అన్ని యాజమాన్యాలలో కూడా తిరస్కరించబడుతుంది. అంటే ఉపాధ్యాయు లకు స్వేచ్ఛ లేదు లేదా ఇవ్వరు అనేది వాస్తవం. అది యాజమాన్యాలకు లేదా ఉన్నతాధికారులకు ఇష్టం లేని విష యం.ఇంతవరకు మనం యాజమాన్యాల కోణం నుండి చూడగా ఉపాధ్యాయుల పరిస్థితిని ఇతర కోణాల నుండి కూడా అధ్యయనం చేయాలి. వారిని తరగతి గదికే పరిమితం చేస్తేవారు విద్యార్థి బౌద్ధిక వికాసానికి బాధ్యత వహి స్తారు. కానీ వారిని బోధనేతర పనులకు వినియోగించడం సర్వసాధారణమై పోయింది. బోధన వారి వృత్తిపరమైన జీవితంలో అతి చిన్నభాగం కాగా ఇతర పనులు సింహ భాగాన్ని ఆక్రమించాయి. తరచుగా పై అధికారుల నుండి వచ్చే రకరకాల ఫార్మాట్లు నింపి పంపడం వారికినిత్యకృత్యమైపోయింది.ఉపాధ్యాయులు బోధన కంటే నివేదికలు ఫారంలో డేటాను అప్లోడ్ చేయడంలో ఎక్కువగా నిమగ్న మవుతున్నారు. ఫొటోలు పంపడం, సాక్ష్యం ఇవ్వడం లాంటివి వారి దైనందిన జీవితంలో భాగమయ్యాయి.
అర్థంపర్థం లేని శిక్షణలు
తరగతి గదిలో కంటే కంప్యూటర్ స్క్రీన్ ముందు గడిపే సమయం పెరిగింది. అర్థంపర్థం లేని శిక్షణలు అవి కూడా పాఠశాలలు చాలా చక్కగాజరుగుతున్న కాలంలో ఉపాధ్యా యులు ముఖ్యంగా సిలబస్ పూర్తి చేసి విద్యార్థులను పరీక్ష లకు సిద్ధం చేయడంలో నిమగ్నమైనప్పుడు వారిని శిక్షణల పేరుతో శిక్షలకుగురిచేస్తారు. అందులో కొత్తగా నేర్పేదిఏమీ ఉండదు, నేర్చుకునేది అంతకన్నా ఉండదు. శిక్షణా కాలం చివరన ఫీడ్ బ్యాక్ పేరున ఇచ్చే ఫారాలలో చాలా గొప్పగా ఉపయోగపడే శిక్షణగా బలవంతంగా రాయించుకుని పంపి స్తారు. ఇక ప్రభుత్వాలకు గుర్తొచ్చినప్పుడల్లా సర్వేలు నిర్వ హించాలి. అందుకు ఉపాధ్యాయులే తగిన వ్యక్తులు. సర్వే లు ఎలానిర్వహించాలో శిక్షణ సర్వేలకు కూడా అంతుం డదు. ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ మూల స్తంభాలలో ముఖ్యమైనది ఎన్నికలు. ఎన్నికల నిర్వహణకు ఉపాధ్యాయులు అత్యవసరం. ఎందుకంటే వీరికి సహనం ఎక్కువ. నోరు మూసుకొని తిండి తిప్పలు మాని ఉద్యోగ ధర్మం పేరు మీద అర్థరాత్రి వరకు ఎన్నికల డబ్బాలు అప్పగించడానికి గంటల తరబడి క్యూలో నిలబడి కనీసం మంచినీళ్లకుకూడా నోచుకోని అభాగ్యులు. ఆ ఏర్పాట్లు ఎలా ఉంటాయో ఉపాధ్యాయులందరికీ అనుభవమే. నిత్యం విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో వీరికి ఏదో విధమైన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఆ ఎన్నికలను సాధ్యమైనంత వరకు పని దినాల్లోనే నిర్వహించడం రివాజు, వాటికి శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తారు. విద్యార్థులకు ఎంత నష్ట మైనా ఉపాధ్యాయులకు ఎంత కష్టమైనా అధికారులకు ఏమీ పట్టదు. కొన్నిసార్లు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే అవకాశం కూడా లేకుండా పండుగలు, పబ్బాలు లేకుండా కూడా ఎన్నికల కమిషన్ ప్రవర్తిస్తుంది.
భోజన పథకం గుదిబండ
ఇక భారత సర్వోన్న త న్యాయస్థానం ఆదేశాల ప్రకారం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం హెడ్మాస్టర్లకు, ఉపాధ్యాయులకు ఒక గుదిబండగా తయారైంది. ఆశయం మంచిదే, ఆచరణలోనే ప్రభుత్వ అయిష్టత, అలసత్వం అందుకు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు మూల్యం చెల్లించుకుంటున్న పరిస్థితినెలకొన్నది. దీనికి సంబంధించిన లెక్కల సమర్పణ ఇవన్నీ బోధనా సిబ్బంది బాధ్యత కాదు, విధిగా మారడం దారుణం. ప్రతిరోజును ఏదో ఒక దినోత్సవంగా జరుపుకోవడం ఎక్కువైంది. ప్రమాణాల కంటే ప్రదర్శనలు ఎక్కువైనాయి. అంటే ప్రభు త్వమే ఒక పథకం ప్రకారం ఉపాధ్యాయులను తరగతిగదికి దూరం చేస్తున్నది. ఇవన్నీ చాలవన్నట్టు పుస్తకాల పంపిణీ, యూనిఫామ్స్ పంపిణీ, రవాణా వాటిలెక్కలు లాంటి బోధ నేతర పనులు బోధనా వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ఉపాధ్యాయుడి ఆసక్తి దారి తప్పుతున్నది. ఇంకా డిజిటల్ అభ్యసనం, ఆన్లైన్ అభ్యసనం లాంటివి కూడా టీచర్ స్థానా న్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాయి. సాంకేతికతపై అతిగా ఆధారపడుతున్నారు. డిజిటల్ టూల్స్, యాప్లు, స్మార్ట్ బోర్డులు, స్మార్ట్ క్లాస్ రూములు దర్శనమిస్తున్నాయి. మానవ స్పర్శ లోపించి యాంత్రికత కేంద్రీకృతమైంది.
స్వేచ్ఛలేని ఉపాధ్యాయులు
బోధనలో స్వేచ్ఛ కల్పించనంత కాలం ఉపాధ్యాయుడి భోదనాకౌశల్యం పెరిగే అవకాశం లేదు. అతడు అనేక ప్రయోగాలు చేస్తూ వాటిలో ఉత్తమమైన దానిని తానే గుర్తించి ఉపయోగించి విద్యార్థులకు మరింత నేర్పుతో, కౌశల్యంతో, పట్టుదలతో ప్రభావవంతంగా బోధించగలుగుతాడు కానీ ఉన్నతాధికారులు అందుకు ఒప్పుకోరు. తమ ఫార్మాట్లోనే తమ మూసలోనే బోధించాలనేదే వారి సూత్రం. ఈ ప్రయోగాలు ఉపాధ్యాయుడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అతని స్వేచ్ఛ ను హరిస్తున్నాయి. మొత్తంగా అతడికి బోధనపై ఉన్నఆసక్తిని తగ్గిస్తున్నాయి. ఇంకా ఇతర పాఠశాలల్లోని ఉపా ధ్యాయుల బోధనను పర్యవేక్షించడానికి కూడా ఉపాధ్యాయులను వినియోగించు కుంటున్నారు. వారిని టీములుగాతయారు చేసి ఇతర పాఠశాలలకు పంపుతున్నారు. మంచిది కానీ వారిని తమ తరగతి గదికి దూరం చేస్తున్నారు. మరో పక్క కంప్యూటర్ స్కిల్స్ ఉండి అర్హతలు సంపాదించిన ఉపా ధ్యాయులు ఈ రోటీన్ బోధనను విడిచిపెట్టి ఇతర వృత్తుల ను ఆశ్రయిస్తున్నారు. మంచి వేతనాలతో సాఫ్ట్వేర్. ఉద్యో గాలు వారిని ఆకర్షిస్తున్నాయి. కొంతమంది గ్రూప్సర్వీసు ల్లోకి వెళ్లిపోతున్నారు. పర్యవసానంగా తరగతి గదిలో బోధన కుంటుపడుతున్నది. పాఠశాల నిలబడాలి. విద్య కొనసాగాలి. అభ్యసనం నిరంతరంగా సాగాలి. నేర్చుకోవడానికి, బోధించ డానికి వయస్సుతో నిమిత్తం లేదని తరగతిగదిని బ్రతికించా లని విద్యాభిమానులు కోరుకోవాల్సిన తరుణమిది.
-శ్రీ శ్రీ కుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: