📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

Chandrababu Naidu : కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనన్న చంద్రబాబు

Author Icon By Divya Vani M
Updated: June 17, 2025 • 8:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నంలో టీడీపీ (TDP in Visakhapatnam) కార్యకర్తల సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణమని, వారు ఉన్నంత వరకు పార్టీ ఓడిపోదని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు అలిగినా కాడి వదిలేస్తారే కానీ వేరే పార్టీలోకి వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు.తెలుగుదేశం కార్యకర్తలు బాధపడే పరిస్థితిని ఇకనుండి రానివ్వనని చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యకర్తల అనుభవాలు, కష్టాలు వృథా కాకుండా చూస్తామని తెలిపారు. పార్టీ జెండాను ఎత్తి పెట్టి, నిస్వార్థంగా పని చేసిన వారు ఇక నుంచి మరింత ఆదరణ పొందుతారని స్పష్టం చేశారు.

కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే నాయకులు అన్న భావన కొనసాగుతుందన్నారు. ఇకనుంచి సగం రోజును ప్రజల కోసం, మిగిలిన సగం రోజును కార్యకర్తల కోసం కేటాయిస్తానని తెలిపారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.తెలుగుదేశం పార్టీకి కోటి మందికి పైగా సభ్యులున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ స్థాయిలో కార్యకర్తలు ఉన్న పార్టీ దేశంలో మరొకటి లేదన్నారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసానికి తగిన విధంగా పాలన అందిస్తామని చెప్పారు.

ఢిల్లీ వరకు ఎదిగిన తెలుగుదేశం పలుకుబడి

ఈసారి ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీ సాధించిందని, ప్రజలు నమ్మి ఓటేశారు అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా టీడీపీకి గౌరవం పెరిగిందని చెప్పారు. ప్రజలు, కార్యకర్తలు కలిసి ముందుకు సాగితే ఎలాంటి అడ్డంకులైనా దాటవచ్చని స్పష్టం చేశారు.

Read Also : T20 Cricket : అతి ఉత్కంఠభరిత పోరులో చివరకు నెదర్లాండ్స్ విజయం

APPolitics Chandrababu ChandrababuNaidu PoliticalLeadership PoliticalNews TDP activists TDPUpdates Telugu Desam Party Telugudesam Visakhapatnam Review

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.