📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Vaartha live news : Nara Lokesh : నేను అక్కడి వరకు వెళ్లానంటే కారణం నా టీచర్లే : లోకేశ్

Author Icon By Divya Vani M
Updated: September 5, 2025 • 9:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తన విద్యార్థి దశను గుర్తుచేసుకున్నారు. తాను ఓ బ్యాక్ బెంచర్‌నని, అలాంటి తనను ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం వరకు తీసుకెళ్లింది ఉపాధ్యాయులే అని పేర్కొన్నారు. గురువు లేకుండా ఎవరూ ఉన్నత స్థాయికి చేరలేరని అన్నారు. తల్లి తర్వాత తన జీవితంలో అత్యంత గౌరవనీయులు ఉపాధ్యాయులేనని స్పష్టం చేశారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో గురుపూజోత్సవ వేడుక (Guru Puja celebration) లను వైభవంగా నిర్వహించింది. ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేశ్ హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించి సత్కరించారు.

ఉపాధ్యాయుల జ్ఞాపకాలు పంచుకున్న లోకేశ్

ఈ సందర్భంగా లోకేశ్ భావోద్వేగంగా మాట్లాడారు. తన పాఠశాల రోజులు గుర్తుచేసుకుని, “మిమ్మల్ని చూసి నా స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. నేను అల్లరి చేసేవాడిని. మంజులా మేడమ్, ప్రిన్సిపాల్ రమాదేవి, పి. నారాయణ గారు, ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నన్ను తీర్చిదిద్దారు. వీరి వల్లనే నేను ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మీ ముందున్నాను” అని అన్నారు.ప్రభుత్వ విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. “ప్రభుత్వ విద్య అంటే ఎవరైనా మాట్లాడితే అది ఆంధ్రప్రదేశ్ గురించే ఉండాలి. ఢిల్లీలో మేజిక్ అని చెబుతున్నారు. కానీ అసలైన అద్భుతం ఏపీలో జరగాలి. అందరం కలసి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (లీప్) విజయవంతం చేద్దాం” అని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు చేసిన కృషిని లోకేశ్ ప్రశంసించారు. కొందరు స్కూటర్‌కి మైక్ కట్టి ప్రచారం చేశారని చెప్పారు. “జీరో ఇన్వెస్ట్‌మెంట్, హై రిటర్న్స్ అని ప్రభుత్వ బడులను గురించి చెప్పిన ఒక టీచర్ మాటలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల ముందు “నో అడ్మిషన్” బోర్డులు పెట్టిన ఘనత ఉపాధ్యాయులదే అని కొనియాడారు.

ఉపాధ్యాయ నియామకాలపై స్పష్టత

ఉపాధ్యాయ నియామకాల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. 70కుపైగా కేసులు పెట్టినా ప్రక్రియ ఆగలేదు. ఈ సెప్టెంబర్‌లో 16,347 మంది ఉపాధ్యాయులు తరగతుల్లో చేరబోతున్నారు అని వెల్లడించారు.2019 నుంచి 2024 వరకు విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని లోకేశ్ విమర్శించారు. రోజుకో సంస్కరణ పేరుతో గందరగోళం సృష్టించారని, 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి దూరమయ్యారని అన్నారు. ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు కాపలా కాయించే దుస్థితి వచ్చిందని, జీతాలు ఆలస్యంగా వచ్చినాయని గుర్తు చేశారు. “అన్ని కష్టాలు ఎదుర్కొన్నా నిలబడిన ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు” అన్నారు.

Read Also :

https://vaartha.com/water-supply-to-be-cut-off-for-48-hours-in-hyderabad/hyderabad/542139/

Chandrababu Naidu DSC Gurupooja Utsavam Andhra Pradesh Lokesh Comments on Teachers Nara Lokesh Nara Lokesh comments Teachers Day 2025 Teachers Felicitation Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.