📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Murder : అల్లుడ్ని అత్యంత దారుణంగా హత్య చేయించిన మామ

Author Icon By Divya Vani M
Updated: July 13, 2025 • 8:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ (Sri Sathya Sai District Mudigubba)లో ఒక దారుణమైన హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మామ, తన అల్లుడిని ప్రాణం తీసేందుకు సుపారీ (Uncle uses betel nut to kill his son-in-law) ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.తనకల్లు మండలం ఎర్రగుంటపల్లికి చెందిన బుగుడే విశ్వనాథ్‌కి 20 ఏళ్ల క్రితం గాజుకుంటపల్లికి చెందిన శ్యామలతో పెళ్లి జరిగింది. మొదట్లో వారి దాంపత్య జీవితం సజావుగా సాగింది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. విశ్వనాథ్ తన భార్య చెల్లెలు, అత్తతో అనైతిక సంబంధాలు పెట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు అనుమానించారు.అంతేకాదు, అత్త పేరిట ఉన్న విలువైన భూములను ఆయన ఎవరికీ చెప్పకుండా అమ్మేశాడు. ఈ వ్యవహారంపై మామ రమణ తీవ్రంగా ఆగ్రహించాడు. అల్లుడి వల్ల తన కుటుంబం నాశనమవుతోందని భావించిన రమణ, అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు.

Murder : అల్లుడ్ని అత్యంత దారుణంగా హత్య చేయించిన మామ

మద్యం పార్టీ పేరుతో హత్య ప్లాన్

రమణ, తన స్నేహితుడు రమణప్పకు ఆర్థిక బాద్యతలు ఉన్న సమయంలో ఈ హత్య ప్రణాళిక వివరించాడు. బదులుగా అప్పు మాఫీతో పాటు రెండు లక్షలు ఇస్తానని ఒప్పించాడు. తర్వాత కమతం రామకృష్ణ, మధుబాబు అనే ఆటో డ్రైవర్ల సహకారంతో హత్యకు పథకం వేశారు.జూలై 1న ముదిగుబ్బ శివారులోని అటవీప్రాంతానికి విశ్వనాథ్‌ను మద్యం పార్టీ పేరుతో పిలిపించారు. మద్యం తాగిన అనంతరం అతనిపై దాడి చేసి వేట కొడవళ్లతో తలనరికేశారు. తల, శరీరం వేరుచేసి అక్కడి నుంచి పరారయ్యారు.

నిందితుల అరెస్టుతో నిజాలు బహిర్గతం

పోలీసుల విచారణలో ఈ హత్యకు సంబంధించి మామనే సుపారీ ఇచ్చినట్లు తేలింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, కదిరి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ దారుణ ఘటనపై ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

Read Also : Kota Srinivasa Rao : కోట శ్రీనివాస‌రావు మృతి : క‌న్నీరు పెట్టుకున్న బాబు మోహ‌న్

AndhraCrimeNews FamilyFeudTurnsFatal KadiriCourt MudigubbaMurderCase MurderForProperty ShockingCrimeInAP SPRevealsMurderPlan SriSathyaSaiDistrictCrime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.