📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Nuzvidu-Kaikaluru: మరోసారి తెర మీదకు నూజివీడు, కైకలూరు విలీన అంశం

Author Icon By Anusha
Updated: October 26, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన పునరాలోచనకు వస్తోంది. ఈక్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసం.. మంత్రివర్గ ఉప కమిటీ (Sub-committee) ని నియమించింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించింది.

Read Also: Bapatla Railway Station: 21 కేజీల గంజాయి స్వాధీనం నిందితుడు అరెస్ట్

దీంతో కృష్ణా జిల్లాలోని నూజివీడు , కైకలూరు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయి. అయితే నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్‌టీఆర్‌ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా (Krishna District) లో కలపాలంటూ ఆ ప్రాంత వాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.

తాజాగా మరో సారి ఈ రెండు ప్రాంతల విలీన ప్రతిపాదన అంశం తెర మీదకు వచ్చింది.ప్రస్తుతం నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను.. ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాలో విలీనం చేసే అంశానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల ప్రజలతో పాటు ఆయ సంఘాలతో సంప్రదించి అభిప్రాయాలు సేకరించారు.

Nuzvidu-Kaikaluru

ప్రజలు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు

దీని కన్నా ముందే తమను కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో కలపాలని ఈ రెండు ప్రాంతాల ప్రజలు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.జిల్లాల విభజనకు పూర్వం ఈ రెండు నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేవి. నూజివీడు విజయవాడకు చాలా దగ్గర.

దీంతో ఆ ప్రాంత వాసులు.. చదువు, వాణిజ్యం, ఉద్యోగాల నిమిత్తం విజయవాడ నగరానికి వెళ్తారు. అయితే విభజన తర్వాత తమకు ఏలూరు జిల్లా అనుకూలంగా లేదని.. ఎన్టీఆర్‌లో కలపాలని ప్రజలు కోరినట్లుగా తెలిసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News krishna district news latest news Nuzvid Kaikaluru merge Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.