అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి గౌరవ ప్రతిష్ట లను కాపాడడం ఈ దేశ సంస్కారం. భారత దేశ సంస్కృతీ
సంప్రదాయాలు కూడా అదే చెబుతున్నాయి. దేశ స్థాయిలోనే వారు అలంకరించి న స్థానం అత్యున్నతమైనది. అలాంటి భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మీద ఓ సీనియర్ న్యాయవాది బూటు విసిరే ప్రయత్నం చేసాడు. కోర్టులో తమకనుకూలమైన తీర్పులు రానివారు ఆ న్యాయమూర్తు ల పట్ల కసితో రగిలిపోయిన సందర్భాలు చూశాం. కొన్ని ఉదంతాలు కూడా మనకు తెలుసు. కానీ ఏకంగా అత్యు న్నత ధర్మాసనం అధిష్టించిన ప్రధాన న్యాయమూర్తిపై ఈ రకమైన దాడి ఇదే తొలిసారి. సభ్యసమాజం హర్షిం చలేనిది. ‘ఈ దాడి భారతీయులందరినీ ఆగ్రహానికి గురి చేసింది. ఇలాంటి చర్యలకు మన సమాజంలో చోటు లేదు’ ఈ మాటన్నది ఎవరో కాదు, ప్రధాన న్యాయ మూర్తి గవాయ్ని ఫోన్లో పరామర్శించిన అనంతరం ప్రధాని నరేంద్రమోడీ అన్న మాటలివి. ఘటన జరిగిన సమయంలోనూ, అదే సందర్భంలోనూ ఆ తర్వాత ప్రశాంతతను కాపాడుతూ సిజెఐ స్పందించిన తీరును ప్రధాని అభినందించారు. ఉన్నత ధర్మాసనాన్ని ఎంతో హుందాగా నిర్వహించడంలో గవాయ్ ఎన్నోసార్లు తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నారు. అనేక సంచలనాత్మక నిర్ణ యాలను తమ తీర్పుల్లో ప్రవచించేవారు. అంతేకాదు కాల మాన పరిస్థితులకు అనుగుణంగా నేటి తీర్పులుండా లని పదేపదే తమ న్యాయమూర్తులకు బోధించేవారు. న్యాయస్థానాల్లో (The court) పెండింగ్ కేసుల విచారణ కోసం ఎదురు చూసేవారు కాలాతీతమవుతోందని భావించే ఆందోళనే తప్ప సుప్రీం తీర్పులను విమర్శించేవారు బహు తక్కువ. న్యాయచట్టాల పరిధిలో తీర్పులు, అప్పీళ్లు, పునశ్చరణ, పునః ప్రస్తావన వంటి ఎన్నో ప్రక్రియలు న్యాయస్థానం (The court)గౌరవాన్ని పెంచేటట్లుగానే ఉంటాయి. తుది తీర్పుల్లో న్యాయం అందే తీరుతుందని భారతీయులంతా మెచ్చు కుంటూ న్యాయస్థానాలను (The court), న్యాయాధిపతులను గౌరవి స్తూనే ఉన్నారు. కానీ విచిత్రంగా సోమవారం సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై జరుగబోయిన అఘా యిత్యాన్ని జాతి యావత్తూ ఖండిస్తోంది. ఈ దాష్టీకానికి ప్రయత్నించింది పరాయి దేశస్థుడో,జాతికుల మత ద్వేషాలున్నవారో కాదు. అతనూ భారతీయుల్లో ఒకరే. ఆయనెలా విమర్శించినా, ఎన్ని ఎత్తుగడలు గుప్పించినా అతని మీద ఎలాంటి కేసు నమోదు చేయవద్దని సిజెఐ ఆదేశించడం ఆయనలోని వ్యక్తిత్వమే చెబుతోంది. ఉన్నత ధర్మాసనాధిపతిగా తీసుకునే ప్రతి చర్యా ఆ స్థానం గౌరవ ప్రతిష్టలను ఇనుమడింప చేసేవిగానే ఉంటాయి. సాధార ణంగా తమ ముందుకొచ్చిన కేసుల్లోని వాస్తవాలను, లోతుపాతుల్ని వెలికితీసేందుకు న్యాయమూర్తులు బెంచి మీద నుంచి ప్రశ్నలు వేయడం ద్వారా కక్షిదారుల తరపు న్యాయవాదుల వాదనలు, వాటిలోని పసను రాబట్టుకునే ప్రయత్నం చేస్తుండడం సహజం న్యాయ ప్రక్రియలో అదీ ఒక భాగమే. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తుంటారు. అది సానుకూల వ్యాఖ్యలు కావొచ్చు. కాక పోవచ్చు. అవన్నీన్యాయాన్వేషణలో భాగంగానే చూడాలి. ‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించబోనంటూ’ కోర్టు హాల్లోని సీనియర్ న్యాయవాది రాకేష్ సురేష్ ఒక్కసారి గా ప్రధాన న్యాయమూర్తి వైపు లంఘించబోగా వేదిక వద్దకు చేరకుండానే భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకొని వారించారు. ఆ సమయంలో కోర్టు నెం.1 బెంచి మీద జస్టిస్ గవాయ్, జస్టిస్ కె. వినోద చంద్రన్లు కేసులు నిర్వహిస్తున్నారు. సిజెఐ గవాయ్ మాత్రం ఇలాంటివ్యాఖ్య లు తనను ప్రభావితం చేయబోవని వ్యాఖ్యానించారు. ఇటీవల ఖజురాహోలో విష్ణుమూర్తి విగ్రహ పునఃస్థాపన విషయంలో కోర్టులో సిజెఐ వ్యాఖ్యలకు నిరసనగానే ఇలాంటి ప్రయత్నం జరిగినట్లు తెలిసింది. కేసును కొట్టేసి ‘ఆ దేవుడినే ‘ఏదైనా చేయమని అడగండి’ అన్న వ్యాఖ్య ల పై కొందరికి అసంతృప్తి కలిగిన మాట నిజమే. అది తీర్పులో భాగం కాదు. వ్యాఖ్యాన ప్రస్తావన మాత్రమే. ఈ అంశాలేవీ తీర్పును ప్రభావితం చేయవు. న్యాయప్రక్రియ లో దీనికి పెద్ద దోషమేమీ అంటదు. నిజానికది పురావస్తు శాఖ స్థలం కనుక వారే అనుమతినివ్వాలని తాను చేయగలిగేదేమీ లేదని అన్నారు. ఆ తర్వాత ఒక సంద ర్భంలో సిజెఐ తాను అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు కూడా. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిందితుడు రాకేశ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించగానే పోలీసులు ఆయనను ప్రశ్నించి వదిలేశారు. ఇప్పుడాయన టీవీ ఛానల్స్ కు తన చర్యలను సమర్థించుకుంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ బూటు విసిరించి నేను కాదు, దేవుడేనని’ రాకేష్ చేస్తున్న వ్యాఖ్యలు హర్షించదగి నవి కావు. సిజెఐ వ్యాఖ్యల నాటి నుంచి తనకు నిద్రపట్టడం లేదని, తనను ‘గమ్మునుంటా వెందుకని ఆ దేవుడు తట్టి లేపాడ’ని ఇలా అర్థం లేని వాగుడుతో ‘ఏదో దైవికశక్తి నాతో ఆ పనిచేయించిందం’ టూ తన తప్పు కప్పిపుచ్చుకోవాలని సంజాయిషీ చెప్తు న్నాడు. జైలుకైనా సిద్ధమట. బార్ కౌన్సిల్ ఈ ఉదం తంపై
స్పందిస్తూ రాకేశ్ దేశంలోని ఏ కోర్టులోనూ వాదించకుండా అతడి సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈఘటన అన్ని రాజకీయ పక్షాల అగ్రనేతలూ ఖండించారు. ప్రధాన న్యాయమూర్తి తనపై దాడియత్నం మీద
మానవత్వంతో స్పందించారన్న ప్రశంసలు అందుకున్నారు. తుచ్చమైన ప్రచారం కోసం ఓ వ్యక్తి ఇలాంటి చర్యకుపాల్పడ్డారని కొట్టిపారేశారు. ఈ సంఘటన దురదృష్టకరం. భారతీయ సమాజం ఖండిస్తున్న సంఘటన.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: