దేశమంతటా శీతలగాలులు ప్రారంభమయ్యా యి. ఎన్నడూ లేనిది ఈసారి ‘సింగిల్ డిజిట్’ ఉష్ణోగ్రత ప్రజల్ని ఇంట్లోంచి బయటకు రానీయడం లేదు. చలి (The cold)రోజురోజుకి పెరిగిపోతోంది. సాధా రణ ఉష్ణోగ్రతలు మటుమాయమై చలిగాలులు ప్రారంభ మయ్యాయి. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయన్న హెచ్చరికల మధ్య జనం ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఈ చలిని తట్టుకోవడం నిజానికి కష్టంగానే ఉంది. తెలం గాణ రాష్ట్రం తీవ్ర చలి ప్రభావిత కోర్ కోల్డ్వవ్ జోన్లో ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ (ఎన్ పిపిసిసి హెచ్చ్), లోగడనే ప్రకటించింది. ఈసారి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోదగినవేమీ లేవు. కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5డిగ్రీల కన్నా కిందకు పడిపోయే ప్రమాదం ఉంది. మరో 2 రోజులు ఆగితే జనం పూర్తిగా ఇంటికే పరిమితమైపోవాల్సి వస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5డిగ్రీల వరకు ప్రకృతి ఉత్పాతాలు వచ్చినప్పుడు వాతావరణ శాఖ సూచించే ‘అలర్ట్’లు చలికి వేడికీ కూడావర్తిస్తాయి. చలి (The cold)తీవ్రతకు సంబంధించి తెలం గాణలోని మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫా బాద్, ఆదిలాబాద్లకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలలో 10 డిగ్రీలకన్నా తక్కువకు పడిపోవచ్చునని వాతావరణ విశ్లేషణల ద్వారా కనుగొన్న హెచ్చరికలివి. మిగిలిన జిల్లాలు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపో వచ్చుననే అంచనాతో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇప్ప టికే చలి తీవ్రతతో ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ఉదయం 9 గంటల దాకా పొగమంచు ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే గత మూడు రోజుల్లో సాధారణం కన్నా 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. తెలుగు రాష్ట్రాలకు చలీ వదిలేటట్లు లేదు. వాన చినుకులు వదిలేటట్లు లేవు. ఈ వరుణుడి శాపం ఈనాటిది కాదు. గత 5,6 నెలలు గా ఈ రెండు రాష్ట్రాల రైతాంగం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ‘మొంథా’తుఫాను ప్రభావం నుంచి కుదుటపడుతున్నారనేలోపే మరో అవాంతరం మీద పడనున్నది. ఆంధ్రప్రదేశ్లో కూడా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగిపో తోంది. అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాలేకాదు మైదాన ప్రాం తాల్లోని శ్రీకాకుళం, కర్నూలు, ఎన్టీయార్ జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 6నుంచి 16 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలున్నాయి. కొన్ని జిల్లాలో వేడి గాలులు ఉన్నాయి. రానున్న రోజుల్లో 19వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఆవర్తనం ఏర్పడ్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం వాయు గుండంగా మారితే ఈ నెల 24నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీవర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్ష వాతావరణం నుంచి శీతల కాలానికి ప్రవేశిస్తున్నామనుకున్న తరుణంలో మళ్లీ వర్షాలంటే ఇక రైతు ఏమాత్ర మూ కోలుకునే పరిస్థితి లేదనే భావన రైతాంగంలోఉంది. నిన్నమొన్నటి వరకు అధిక కాలుష్య సూచీలతో సతమతమైన ఢిల్లీ కూడా శీతల గాలులు వ్యాపిస్తున్నాయి. రాజధాని వాసులకు ఎలాంటి ఊరట లభించే అవకాశం లేదు. తెలుగురాష్ట్రాలకు సంబంధించి మరికొన్ని రోజులు చలిగాలులను భరించక తప్పదు. ఝాము పొద్దుటే ఎవరూ బయటకు రాలేకపోతున్నారు. రాత్రిపూట చలిగాలు లకు శరీరం మంటలెక్కుతోంది. ఎముకలు కొరికే చలికి ప్రజలు గజగజలాడుతున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో సింగిల్ డజన్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగా రెడ్డిజిల్లా కోహిర్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 7.8డిగ్రీలు నమోదైంది. అన్ని చోట్ల దాదాపు డిగ్రీల కన్నా తక్కు వే. వచ్చే నాలుగైదు రోజుల్లో కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా3 నుంచి 4డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఆంధ్రాలో అల్పపీడనం వాయుగుండం ప్రభా వం ఉండనే ఉంది. ఈ కారణం చేత ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, కర్ణాటక, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇలాంటి వర్షాలకు పంటలు చివరి ప్రయత్నంగా మరో సారి నష్టాలతో చతికిలపడిపోవడం ఖాయం. చలి నుంచి కాచుకునేందుకు తెల్లారి లేచి చలిమంటలు వేసుకుంటున్న ప్పుడు కాలుష్యం వెదజల్లుతుందని వాటి జోలికి పోరాదాని వైద్యులు చెబుతున్నారు. మంటల వేడిమి కోసం ప్లాస్టిక్ రబ్బరు, ఇతరత్రా చెత్త కూడా మండుతున్నప్పుడు కాలుష్యం నుంచి కాపాడడం కష్టమని వాటికి పిల్లల్ని దూరంగా ఉంచమని వేడుకుంటున్నారు. ఇలాంటి మంట ల సమయంలో సూక్ష్మ ధూళికణాలు వ్యాప్తి చెంది విషతుల్యమౌతుంటాయి. ఈ గాలులు కారణంగా శ్వాసకోస సమస్యలు వస్తాయని, తమవద్ద ఇలాంటి వ్యాధులకు గురయిన పిల్లలు, పెద్దలు, వృద్ధులు చికిత్సకు కోసం వస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. ఆస్తమా, కేన్సర్, దీర్ఘ కాలిక సమస్యలు ఏర్పడకుండా హార్మోన్ల అసమతుల్య త, ఆమ్లవర్షాల నుంచి కట్టడి చేసుకోవాలి. ఇంటిలోకి చలి ప్రవేశించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ మధ్యనే చలితీవ్రత తట్టుకో లేక ఇద్దరు వృద్ధులు దుర్మణంపాల య్యారు. ఉలెన్ దుస్తులు ధరించి బయటకు రావచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు. చలి పెరగడంతో తాము నిల్వ చేసుకున్న పత్తిపై తేమ శాతం పెరుగుతోందని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేయడం చూస్తున్నాము.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :