📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Pawan Kalyan : చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు : పవన్

Author Icon By Divya Vani M
Updated: July 23, 2025 • 10:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన “హరిహర వీరమల్లు” చిత్రం జులై 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ హాజరయ్యారు. అభిమానుల మధ్య మెరిసిన పవన్, సినిమాతో పాటు తన రాజకీయ భావోద్వేగాలపై కూడా స్పందించారు.ఈ వేళ పవన్ మాట్లాడుతూ, తన సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు (Thank you Chandrababu)తెలిపారు. అలాగే, సినిమా విజయం కోసం సోషల్ మీడియాలో మద్దతుగా పోస్ట్ చేసిన నారా లోకేశ్కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Pawan Kalyan : చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు : పవన్

“పుట్టింది ఎక్కడంటే.. ఎక్కడైనా అనిపించదు!”

తనపై జరుగుతున్న విమర్శలపై కూడా పవన్ స్పందించారు. “ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టాను అంటాడు” అంటూ విమర్శించే వారిని బావిలో కప్పలతో పోల్చారు. ఆవిషయాన్ని ఎత్తి చూపుతూ, తన పేరులోనే గాలి ఉందని, కాబట్టి ఎక్కడైనా ఉంటానని చురక వేశారు.పవన్, చిత్రరంగంలోకి రావడానికి ముందు విశాఖలో నటనలో నైపుణ్యం పెంచుకున్నట్టు తెలిపారు. బాల్యంలో తాను ఏవైనా కోరికలతో ఎదగలేదని, అయితే అన్యాయం జరిగితే నిలదీయాలనే తపన ఉండేదని చెప్పారు. డబ్బు కోసమో, ఫేమ్ కోసమో సినిమాల్లోకి రాలేదన్నారు.

అన్నా–వదినే నా దేవతలు

తన జీవితంలో తన అన్నయ్య, వదిన ఇద్దరూ దేవతలే అని పవన్ చెప్పారు. వారి నమ్మకమే తనకు బలం అని వివరించారు. నటన కన్నా ఫిలిం మేకింగ్ పైనే ఎక్కువ ఆసక్తి ఉన్నదని తెలియజేశారు.ఈ సినిమా తొలుత క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమై 30% షూటింగ్ పూర్తయిందని చెప్పారు. అయితే, వ్యక్తిగత కారణాలతో క్రిష్ తప్పుకోవడంతో, దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చేపట్టి సినిమాను దూసుకుపోతున్నారని వివరించారు. సినిమా టీజర్‌తో అన్ని అనుమానాలూ తొలగిపోయాయని స్పష్టం చేశారు.

Read Also : Nara Lokesh : లోకేష్ చొరవ తో వైజాగ్ కు పెట్టుబడుల వెల్లువ!

APPolitics ChandrababuNaidu JSP NaraLokesh PawanKalyan PawanSpeech TDP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.