ఆంధ్రప్రదేశ్ లోని, గుంటూరు జిల్లా తెనాలి (Tenali) లో, రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న, ఓ వృద్ధురాలి ఇంట్లో ఏకంగా కోటిన్నర రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు బయటపడటం సంచలనంగా మారింది. రోజువారీ కూలి పనులు చేసుకునే ఆమె ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో సంపద బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తెనాలి పట్టణం బాలాజీరావుపేట సమీపంలోని మహేంద్ర కాలనీలో పేరిబోయిన గురవమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉంటోంది.
Read Also: Prakasam district murder:లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య
రైస్ పుల్లింగ్ జరుగుతోందన్న సమాచారం తో తనికీలు
ఆమె రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు రైస్ పుల్లింగ్ జరుగుతోందన్న సమాచారం వచ్చింది. వెంటనే డీఎస్పీ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురవమ్మ ఇంట్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు..
ఇంత పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు ఎక్కడివని పోలీసులు గురవమ్మను ప్రశ్నించగా, అదంతా విజయవాడలో ఉండే తన అల్లుడిదని ఆమె బదులిచ్చింది. అతను భవానీపురంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడని, అందులో భాగస్వామి అని, బాగా ఆస్తిపరుడని చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే విజయవాడలోని ఆమె అల్లుడి ఇంటికి వెళ్లారు.
అయితే, పోలీసుల రాకను ముందే పసిగట్టిన అతను అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ బంగారం నిజంగా అతని సంపాదనేనా? లేక అక్రమ మార్గాల్లో కూడబెట్టాడా? లేదా ఎవరైనా బడా పారిశ్రామికవేత్తలు అతన్ని బినామీగా వాడుకుంటున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: