Temple : తిరుచానూరు శ్రీపద్మావతిఅమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 5వతేదీ (September 5th) శుక్రవారం నుండి 7వతేదీ ఆదివారం వరకు మూడురోజులు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబర్ 2వతేదీ మంగళవారం సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతిఉత్సవం , అంకురార్పణ చేపట్టనున్నారు. ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీతెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా మూడురోజులపాటు నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం (Conducting holy festivals) ఆనవాయితీ. సెప్టెంబర్ 5వతేదీ ప్రవిత్రప్రతిష్ట, 6న పవిత్ర సమర్పణ, 7వతేదీ పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. 750 రూపాయలు చెల్లించి పవిత్రోత్సవాలు టిక్కెట్ పొందే గృహస్థభక్తులకు 2లడ్డూలు, 2వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 4న అంకురార్పణ సందర్భంగా అమ్మవారికి జరిగే తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, 5వతేదీ అభిషేకానంతరం దర్శనం, లక్ష్మీపూజ సేవలు రద్దుచేశారు. అలాగే సెప్టెంబర్ 5,6,7 తేదీల్లో మూడురోజులు కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేద కుంకుమార్చన, ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్ సేవలు రద్దుచేసింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :