దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మళ్లీ ప్రారంభమైంది. శుక్ర మౌఢ్యమి కారణంగా నవంబర్ నుంచి నిలిచిపోయిన శుభకార్యాలకు ఫిబ్రవరి 17తో ముగింపు పలికింది. దీంతో పెళ్లి (Marriage) తేదీల కోసం ఎదురు చూస్తున్న వధూవరుల కుటుంబాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు మళ్లీ సందడితో నిండనున్నాయి.
Read also: CM Revanth: దావోస్ పర్యటనలో ప్రముఖులు
Wedding festivities return to the Telugu states
ఫిబ్రవరి 19 నుంచి బలమైన వివాహ ముహూర్తాలు
పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 21న అత్యధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నట్లు సమాచారం. ఇదే కాకుండా మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై నెలల్లో కూడా మంచి శుభ ఘడియలు ఉండటంతో పురోహితులు, వెడ్డింగ్ ప్లానర్లు, క్యాటరింగ్ సర్వీసుల బుకింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి.
పెళ్లి ఏర్పాట్లపై పెరిగిన డిమాండ్
పెళ్లిళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, డెకరేషన్, పురోహితుల సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతంలో రూ.25,000 నుంచి రూ.60,000 మధ్య ఉండే పురోహితుల సంభావన ఇప్పుడు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు పెరిగిందని కుటుంబాలు చెబుతున్నాయి. అలాగే రూ.10 లక్షల అద్దె ఉండే కొన్ని ఫంక్షన్ హాళ్లు ఇప్పుడు రూ.13 లక్షల వరకు అడుగుతున్నట్లు తెలుస్తోంది.
పెరిగిన ఖర్చులతో ఆందోళనలో కుటుంబాలు
ఇప్పటికే పెళ్లి ఖర్చులు భారంగా మారిన పరిస్థితుల్లో, బంగారం ధరలు పెరగడం వధూవరుల కుటుంబాలపై మరింత భారం మోపుతోంది. శుభ ముహూర్తాలు వచ్చిన ఆనందం ఒకవైపు ఉంటే, మరోవైపు పెరిగిన ఖర్చులు కుటుంబాలను సతమతమయ్యేలా చేస్తున్నాయి. అయినా సంప్రదాయం, ఆచారం, ఆనందాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కుటుంబాలు ముందుకు సాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: