ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ
విజయవాడ : ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు (Potti Sriramulu)తెలుగు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా ఏర్పడనున్నాయి. ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఏపీలో ఏర్పాటైన ఈ రెండు విశ్వవిద్యాలయాలు హైదరా బాద్లో ఉన్నాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గత సంవత్సరం జూన్ 2 నాటికి 10 ఏళ్లు పూర్తయినందున అవి ఏపీలో సేవలను నిలిపివేశాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరంలో, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యా లయాన్ని ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్లాన్. చేస్తున్నారు. ఇందుకోసం ఏలూరు జిల్లాలో రెండుచోట్ల భూములను పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటిల్లో ఒకటి ఎంపిక చేయనున్నారు. భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు అంబేడ్కర్ వర్సిటీని తాత్కాలికంగా ఎక్కడో. చోట ఏర్పాటు చేసి, ప్రవేశాలు నిర్వహిస్తారు. తెలుగు (Telugu University) విశ్వవిద్యాలయానికి శ్రీశైలం, కూచిపూడి, రాజమహేంద్రవరంలో పీఠాలు ఉన్నాయి. గత ఏడాది ప్రవేశాలు నిర్వహించనందున ఇప్పుడు రెండో ఏడాది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. రాజమహేంద్రవరంలో భవనాలను ఆధునికీకరించి విశ్వవిద్యాయాల కార్యకలాపాలు ప్రారంభిస్తారు. విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రారంభ బడ్జెట్ కింద రూ.20 కోట్లు, జీత భత్యాలు, మోలిక సదుపాయాల కల్పనకు మరో రూ.30 కోట్లు అవసరం కావొచ్చని ఇటీవల అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం హైదరాబాద్ వర్సిటీలో 22 విభాగాలు, 40 కోర్సులు ఉన్నాయి. వీటన్నింటినీ ఇక్కడ ప్రారంభించాలంటే 72 బోధన పోస్టులు, 115 బోధనేతర పోస్టులు అవసరమవుతాయి. మొదట డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభిస్తారు.
Read also: జనవరిలో 2వేల DSC పోస్టులకు నోటిఫికేషన్ – లోకేష్
తాత్కాలిక భవనాల్లో అంబేడ్కర్ వర్సిటీ:
అంబేడ్కర్ విశ్వవిద్యాలయం (Telugu University) తరపున ఏపీలో 76 దూరవిద్య కేంద్రాలున్నాయి. డిప్లొమో, డిగ్రీ, పీజీ కోర్సుల్లో కలిపి ఏటా 16 వేల మంది వరకు ప్రవేశాలు పొందుతారు. ఫీజుల రూపంలోనే తాత్కాలిక భవనాలలో ఏర్పాటు యోచన. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు. విశ్వవిద్యాలయాలకు ఏపీ నుంచి రూ.21 కోట్ల ఆదాయం వస్తోంది. ఏపీ స్టడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాల కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.5.40 కోట్లు చెల్లిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా వర్సిటీ ఏర్పాటు చేస్తే బోధన 50, బోధనేతర పోస్టులు 68 వరకు అవసరమవుతాయి. అద్దె భవనంలో దీన్ని ఏర్పాటు చేసి, వీటిని నిర్వహించేందుకు రూ.63.85 కోట్లకు పైగా కావాలని ఇటీవల అధికారులు ప్రతిపాదించారు.
ఈ ఏడాది నుంచే ప్రవేశాలు:
తెలుగు, అంబేడ్కర్ వర్సిటీల్లో గత ఏడాది ఎలాంటి ప్రవేశాలు చేపట్టలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహిస్తారు. అంబేడ్కర్ సార్వత్రిక వర్సిటీ ఏపీలోని స్టడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి 10 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. గతంలో ఏపీ నుంచి జీతాల బిల్లు పంపిస్తే విశ్వవిద్యాలయాలు ఆమోదించిన తరువాతే చెల్లింపులు చేసేవారు. ఇకపై ఈ పరిస్థితులు ఉండవంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించింది. తెలుగు వర్సిటీకి మునిరత్నం నాయుడు, అంబేడ్కర్ వర్సిటీకి ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయభాస్కర్ను ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. ఈ విశ్వవిద్యాలయాల వ్యవస్థ గాడిలో పదాలంటే ప్రత్యేకాధికారులుగా వారినే నియమించాలనే ఆలోచనలో ఉన్నత విద్యాశాఖాధికారులు ఉన్నారంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: