తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) టమాటా ధరలు భారీగా పడిపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని రోజుల వరకు అధిక ధరలతో లాభాలు అందించిన టమాటా పంట, ఇప్పుడు రైతులకు నష్టాల బాట పట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దిగుబడి పెరగడంతో మార్కెట్లలో ధరలు క్షీణించాయి. హైదరాబాద్‌లో రూ.50కే నాలుగు కిలోలు విక్రయిస్తుండగా, రాయలసీమలో రైతులకు కిలోకు కేవలం రూ.5 మాత్రమే లభిస్తోంది. ఖర్చులకు కూడా రాని పరిస్థితి ఉండటంతో పలుచోట్ల రైతులు పంటను రోడ్లపై పారబోస్తున్నారు. మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఉల్లి ధర కిలో రూ.30 వద్ద కొనసాగుతోంది.
Read Also: Telangana : తెలంగాణకు కేంద్రం మరో శుభవార్త
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: