📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Rajareddy-రాజకీయాల్లోకి షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంట్రీ ..జగన్ కి దెబ్బేనా?

Author Icon By Pooja
Updated: September 8, 2025 • 1:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajareddy-ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ రోజు కర్నూలు(Kurnool) ఉల్లి మార్కెట్ సందర్శనలో ఆయన తల్లి షర్మిలతో పాటు పాల్గొనడం దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. బయలుదేరే ముందు ఆయన అమ్మమ్మ, వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాలో చదువులు, రాజకీయాలపై దృష్టి

వైఎస్ రాజారెడ్డి అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇటీవల అట్లూరి ప్రియను వివాహం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులకు ఎంతో ఆప్తుడు. ముఖ్యంగా విజయమ్మకు రాజారెడ్డి అంటే ప్రత్యేకమైన అనుబంధం ఉంది. జగన్–షర్మిల విభేదాల సమయంలో విజయమ్మ అమెరికాలో మనవడి వద్దే విశ్రాంతి తీసుకోవడం దీనికి ఉదాహరణ. షర్మిల తన కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరో మూడు సంవత్సరాలకు పైగా ఎన్నికలకు సమయం ఉండటంతో ఇప్పుడు నుంచే పర్యటనలు ప్రారంభిస్తే, అప్పటికి ప్రజలతో అనుబంధం పెంపొందించుకోవచ్చని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ నియోజకవర్గం (Parliamentary constituency)నుంచి రాజారెడ్డిని బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది జగన్‌కు రాజకీయంగా సవాలుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

షర్మిల రాజకీయ పంథా

తెలంగాణలో వైఎస్సార్టీపీని స్థాపించిన షర్మిల, ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమితులై, జగన్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో గెలవలేకపోయినా, జగన్ ఓటమికి కారణమయ్యారని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆమె కుమారుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడం మరో కీలక పరిణామంగా కనిపిస్తోంది.

రాజారెడ్డి ఎవరు?
ఆయన వైఎస్ షర్మిల కుమారుడు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలి వారసుడు.

ఆయన రాజకీయ ప్రవేశం ఎక్కడి నుంచి జరగొచ్చు?
పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-nara-lokesh-minister-lokesh-meets-former-bjp-president-annamalai/andhra-pradesh/543281/

AP politics news Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Nara Lokesh updates Pulivendula Assembly seat YS Rajareddy political entry YS Sharmila son politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.