Rain: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 15 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలు ఇప్పటికే నీటమునిగాయి. ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) కూడా లక్షల్లో పంటలు నీటమునిగిపోయాయి. ప్రజలు ఇంకా వర్షం నుంచి తేరుకోకముందే మరో అల్పపీడన పిడుగులాంటివార్త. వాయవ్య బంగాళాఖాతంలో రానున్న 12 నుంచి 3 6గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు అవకాశం ఉందని తెలిపింది.
వద్దంటే వర్షాలతో ప్రజలు పరేషాన్
జులై పడాల్సిన వర్షాలు పడకపోవడంతో రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురు చూశారు. ఆ ఆశ కాస్త నిరాశగా మిగిలింది. ఆగస్టుమాసంలో గరిష్టంగా వర్షాలు పడ్డాయి. గత 15 రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లలో కౌడ్ బరస్ట్ వల్ల చాలామంది మరణించడంతోపాటు అనేకులు గల్లంతు అయ్యారు. గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకునిపోయాయి. ఈ విషాదం నుంచి ఇంకా ప్రజలు కోలుకోకముందే మళ్లీ భారీ వర్షాలు (Heavy rains)రానున్నాయి.
అధికారులు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇచ్చారు?
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు?
కొన్ని తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :