📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Rain Alert-ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ భారీ వర్షాలు

Author Icon By Pooja
Updated: September 2, 2025 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rain Alert: బంగాళాఖాతంలో(Bay of bengal) అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్కు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తీరం వెంబడి తీవ్ర గాలులు

వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింత బలపడనటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తదుపరి 24గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా పెరగవచ్చని తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే సూచనలున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడవచ్చని తెలిపారు.

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దు

మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే ప్రమాదం ఉన్నందున ఎవరూ వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. అదేవిధంగా నదులు, వాగుల సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అప్రమత్తం మళ్లీ వాయుగుండంతో భారీ వర్షాలకు(Heavy Rains) అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే వరుస వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లోని గ్రామాల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలు వరదనీటితో ముచ్చెత్తాయి. నదులు, చెరువులు, గుంటలు నీటితో నిండి పోయాయి. లక్షల ఎకరాలు పంటలు నీటిలో మునిగిపోయాయి. మళ్లీ వాయుగుండంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం హెచ్చరికలు చేసింది.

ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముంది?
విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు మరియు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా.

వర్షాల ప్రభావం వల్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరద ముంపు ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. అవసరం లేకుండా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/today-news-tragedy-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%af%e0%b0%95-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b0%a8%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-2%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6/business/540049/

AndhraPradeshNews AndhraPradeshRainAlert APWeatherUpdate Breaking News in Telugu Google News in Telugu HeavyRainsInAP Latest News in Telugu Telugu News Today TeluguNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.