📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News :Minister Atchannaidu-9.5 లక్షల మె.ట ఎరువుల కేటాయింపు

Author Icon By Pooja
Updated: September 6, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Minister Atchannaidu: రాష్ట్రంలో యూరియా కొరత లేదని, ఎటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నవంబర్ 28, 2024న, ఆయన కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, బాపట్ల, విజయనగరం, కడప, ఏలూరు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లతో పాటు వ్యవసాయ శాఖ(Department of Agriculture)ఈ.ఓ స్పెషల్ సీఎస్ రాజశేఖర్, డైరెక్టర్ ఢిల్లీరావులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

యూరియా నిల్వలపై పర్యవేక్షణ

భవిష్యత్ అవసరాల కోసం రబీ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 9.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. అధికారిక లెక్కలకు, క్షేత్ర స్థాయిలో ఉన్న యూరియా నిల్వలకు(urea reserves) మధ్య తేడా లేకుండా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో యూరియా సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై కలెక్టర్లు త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని మంత్రి సూచించారు. యూరియా నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, సరఫరాను వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. గంగవరం, కాకినాడ పోర్టుల నుంచి రావలసిన 53 వేల మెట్రిక్ టన్నుల యూరియా సకాలంలో రాష్ట్రానికి చేరేలా పోర్ట్, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టాలని, ప్రతిరోజు యూరియా నిల్వల గురించి మీడియాకు వాస్తవాలు వివరించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయా?

అవును, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకారం, రాష్ట్రంలో యూరియాకు ఎటువంటి కొరత లేదు.

రబీ సీజన్ కోసం ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారు?

రబీ సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 9.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-red-fort-the-red-fort-was-targeted-diamond-urn-stolen/crime/542301/

agriculture Andhra Pradesh Farmers Google News in Telugu Latest News in Telugu Minister Atchannaidu supply chain Telugu News Today urea

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.