CS Vijayanand: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ విజయవాడలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిలయన్స్ ఆధ్వర్యంలో రూ.65 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (Biogas) ప్లాంట్లకు అవసరమైన భూములను త్వరగా అప్పగించాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. మొదటి దశలో 9 జిల్లాల్లో గుర్తించిన 2.34 లక్షల ఎకరాల భూమిని వెంటనే అప్పగించాలని కలెక్టర్లను కోరారు.
వర్షపు నీటి సంరక్షణపై ఆదేశాలు
ఈ సమావేశంలో వర్షపు నీటి సంరక్షణ,(Water conservation) భూగర్భ జలాల పెంపు వంటి అంశాలపై కూడా సిఎస్ సమీక్షించారు. వృధాగా పోతున్న వర్షపు నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని అన్ని చెరువులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. యూరియా, పరిశ్రమలు, గురుకులాలు, కెజిబివిలు, స్వచ్ఛాంధ్ర అవార్డులు, పిఎం కుసుమ్ వంటి ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ప్రస్తుతం సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.
రిలయన్స్ సంస్థ ఎన్ని జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది?
మొదటి దశలో 9 జిల్లాల్లో రిలయన్స్ ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎన్ని ఎకరాల భూమిని కేటాయించనుంది?
మొదటి దశ కింద 2.34 లక్షల ఎకరాల భూమిని రిలయన్స్ సంస్థకు అప్పగించనున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: