📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: AP- ఏపీలో రోడ్డు ప్రమాదాల ఆందోళనకర గణాంకాలు

Author Icon By Pooja
Updated: August 31, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ఆంధ్రప్రదేశ్‌లో 2023వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదయ్యాయి. వీటిలో వాహనాల అతివేగం ప్రధాన కారణంగా గుర్తించబడింది. హెల్మెట్ ధరించకపోవడం, సీటుబెల్ట్‌లు ఉపయోగించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్(Safe driving) చేయడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం వంటి కారణాలతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రాష్ట్రంలో 19,949 ప్రమాదాలు సంభవించగా, 8,137 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇందులో పురుషులు 6,695 మంది, మహిళలు 1,442 మంది ఉన్నారు.

అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రభావం

ప్రత్యేకంగా అతివేగం వల్లే 17,171 ప్రమాదాలు చోటుచేసుకోగా, దాదాపు 6,889 మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 130 ప్రమాదాలు జరిగి 70 మంది మరణించారు. అలాగే సెల్‌ఫోన్‌ వాడుతూ డ్రైవింగ్ చేయడం కారణంగా 254 ప్రమాదాలు సంభవించాయి. రాంగ్‌రూట్‌లో ప్రయాణం వల్ల 685 ప్రమాదాలు జరిగి 206 మంది మృత్యువాత పడ్డారు. వీటితో పాటు హెల్మెట్(Helmet) లేకుండా బైక్ నడిపిన కారణంగా 2,229 మంది, వెనుక కూర్చున్న వారు హెల్మెట్ లేకపోవడంతో 879 మంది చనిపోయారు. కార్లలో సీటుబెల్ట్ లేకపోవడం వల్ల కూడా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు

ఏపీలో జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. 8,276 ప్రమాదాల్లో 3,806 మంది మరణించగా, రాష్ట్ర రహదారులపై 4,499 ప్రమాదాలు జరిగి 1,887 మంది మృతి చెందారు. ద్విచక్ర వాహనాలు అత్యధిక ప్రమాదాలకు గురయ్యాయి. 10,415 మంది బైక్ రైడర్లు ప్రమాదాలకు గురై, వారిలో 4,169 మంది మరణించారు. అలాగే పాదచారులు 1,645 మంది, సైకిల్ ప్రయాణికులు 138 మంది, ఆటోల్లో 632 మంది, కార్లు మరియు ట్యాక్సీల్లో 701 మంది, లారీలలో 330 మంది, బస్సుల్లో 109 మంది ప్రాణాలు కోల్పోయారు.

వాతావరణం, డ్రైవింగ్ లైసెన్స్ లోపం ప్రభావం

పగటి వేళల్లో ప్రమాదాలు ఎక్కువగా నమోదు అయ్యాయి. మొత్తం 15,525 ప్రమాదాల్లో 6,204 మంది మృతి చెందారు. వర్షం సమయంలో 1,093 ప్రమాదాలు జరిగి 426 మంది ప్రాణాలు కోల్పోయారు. మంచు సమయంలో 1,556 ప్రమాదాలు చోటుచేసుకొని 700 మంది మరణించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినవారు 2,278 మంది ప్రమాదాలకు కారణమయ్యారు. అలాగే ఎల్‌ఎల్‌ఆర్ ఉన్న వారు 488 ప్రమాదాలు చేశారు. ఈ గణాంకాలు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఏపీలో 2023లో మొత్తం ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయి?
మొత్తం 19,949 ప్రమాదాలు జరిగాయి.

ఈ ప్రమాదాల్లో ఎన్ని మంది మరణించారు?
8,137 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-crime-newborn-baby-found-in-garbage-dump-uproar-in-maharashtra/crime/538968/

AndhraPradeshAccidents APRoadSafety Google News in Telugu HelmetSafety Latest News in Telugu overspeeding RoadAccidentDeaths Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.