టీడీపీ (TDP) పార్టీనే ప్రతి ఒక్కరికీ సుప్రీం అన్న స్పష్టమైన సందేశాన్ని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి బలంగా వినిపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో జరిగిన కీలక సమావేశంలో పార్టీ క్రమశిక్షణ, బలోపేతం అంశాలపై లోతైన చర్చ జరిగింది. పార్టీ ఆదేశాలను ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా పాటించాలన్నదే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని లోకేశ్ స్పష్టం చేశారు.
Read also: Ramakrishna Reddy: ఐదేళ్ల పాలనలో ప్రతి వర్గానికి మేలు చేశాడు జగన్
Telugu Desam Party
క్షేత్రస్థాయిలో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయన్న అంశాన్ని జోనల్ కోఆర్డినేటర్లు నిరంతరం పర్యవేక్షించాలని లోకేశ్ సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అనుబంధ కమిటీల నియామకాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. నియోజకవర్గాల గ్రీవెన్స్‌లలో సమస్యల పరిష్కార పురోగతిపై నివేదికలు తయారు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించేందుకు పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: