Technology : సాంకేతిక విప్లవాలు మానవ చరిత్రను పదేపదే కొత్త దిశల్లోకి నడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆవిరి యంత్రం పరిశ్రమల యుగానికి శ్రీకారం చుట్టింది. విద్యుత్ ప్రపంచాన్ని వేగవంతం చేసింది. కంప్యూటర్లు ఇంటర్నెట్ సమాచారాన్ని ప్రజాస్వామ్యవంతం చేశాయి. ఇప్పుడు అదే స్థాయిలో, బహుశా అంతకంటే వేగంగా ప్రభావం చూపిస్తున్న శక్తి కృత్రిమ మేధస్సు (ఏఐ). ఈ నేపథ్యంలో పరీక్షలు ముగించి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి భవిష్యత్తుపై ఆందోళన చెందు తున్న తల్లిదండ్రులు ఒక కీలకమైన ప్రశ్నను ఎదుర్కొంటు న్నారు. ఏ కోర్సు చదివితే భవిష్యత్తుభద్రంగా ఉంటుంది? గతంలో ఒకకాలంలో ఇంజినీరింగ్ అంటే ఉద్యోగం, తర్వా త కంప్యూటర్ సైన్స్ అంటే భవిష్యత్తు, ఆ తర్వాత ఎంబీఏ అంటే ఎదుగుదల అనే అభిప్రాయాలు బలంగా ఉండేవి. కానీ నేటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డిజిటల్ ప్రపంచం వేగంగా మారుతున్న ఈ కాలంలో ఒకే కోర్సు జీవితాంతం భద్రతను కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఉద్యోగాల స్వభావమే మారుతోంది. ఈ మార్పుకు భయపడాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.
Read Also : India-Pak: అరేబియా సముద్రంలో భారత్-పాక్ సెగ: రంగంలోకి ‘ఐఎన్ఎస్ ధ్రువ్’
Technology : అవకాశాలను తెరు స్తున్నాయి
ఏఐ రాకతో ఉద్యోగాలు పూర్తిగా అంతరించిపోతాయనే భయం సమాజంలో విస్తృతంగా కనిపిస్తోంది. కానీ చరిత్ర చెబుతున్నది ఒకటే ప్రతి సాంకేతిక విప్లవం కొన్ని పాత ఉద్యోగాలను తగ్గించినా, అంతకంటే ఎక్కువ కొత్త అవకాశాలను సృష్టిం చింది. ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తోంది. రొటీన్ పనులు తగ్గినా, విశ్లేషణ, సృజనాత్మకత, నిర్ణయ సామర్థ్యం అవసరమైన కొత్త రంగాలు విస్తృతంగా పెరుగు తున్నాయి. ఈ కొత్త ప్రపంచంలో డేటా కీలకమైనవనరుగా మారింది. డేటాను సేకరించి, శుభ్రపరచి, ఉపయోగపడేలా మార్చే డేటా ఇంజినీర్లు భవిష్యత్తులో అత్యంత అవసరమై న నిపుణులుగా నిలుస్తున్నారు. అదే డేటాలో దాగి ఉన్న నమూనాలను గుర్తించి భవిష్యత్తు అంచనాలు చేసే డేటా సైంటిస్టులు సంస్థల నిర్ణయాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ విశ్లేషణలను నిజ జీవితంలో పనిచేసే సిస్టమ్లుగా రూపొందించే మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా, పెద్దస్థాయి సాంకేతిక వ్యవ స్థలను ముందుచూపుతో రూపకల్పన చేసే ఏఐఆర్కిటెక్ట్లు, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని టెక్నాలజీని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చే ప్రొడక్ట్ మేనేజర్లు, సాంకేతిక బృందం, వ్యాపార బృందం మధ్య వారధిగా పనిచేసే ఏఐ ట్రాన్స్ లేటర్లు వంటి కొత్త వృత్తులు వేగంగా ఎదుగుతున్నాయి. ఇవి కేవలం కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి మాత్రమే కాకుండా భాషా శాస్త్రం, మేనేజ్మెంట్, సైకాలజీ వంటి రంగాల వారికి కూడా అవకాశాలను తెరు స్తున్నాయి.
సృజనాత్మకతను ప్రోత్సహించాలి
ఇటీవల జనరేటివ్ ఏఐ వ్యవస్థలు విస్తృతంగా వినియోగంలోకి రావడంతో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి కొత్త నైపుణ్యాలు వెలుగులోకి వచ్చాయి. సరైన ప్రశ్న అడ గడం కూడా ఒక శాస్త్రంగా మారింది. ఇదే సమయంలో ఏఐ తీసుకునే నిర్ణయాలు సమాజానికి హానికరం కాకుండా ఉండేలా పర్యవేక్షించే ఎథిక్స్ నిపుణులు, డేటా భద్రతను కాపాడే గవర్నెన్స్ స్పెషలిస్టులు కూడా అత్యంత అవసర మైన వృత్తులుగా మారుతున్నారు. ఈపరిణామాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్తు కేవలం డిగ్రీ లపై ఆధారపడదు, నైపుణ్యాలపై ఆధారపడుతుంది. సమ స్యలను అర్థం చేసుకునే సామర్థ్యం, విమర్శనాత్మక ఆలో చన, సృజనాత్మకత, నిరంతర అభ్యాసం వంటి లక్షణాలు రేపటి విజయానికి అసలు పునాదులు. పాతకాలపు బట్టీ విధానం ఇప్పుడు సరిపోదు. విద్యార్థులు కొత్త విషయా లను నేర్చుకోవడంలో ఆసక్తి చూపాలి, టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర కూడా అత్యంత కీలకం. పిల్లలను కేవలం మార్కుల కోసం పరుగులు పెట్టించే పోటీ యంత్రాలుగా కాకుండా, సమస్యలను పరిష్కరించే ఆలోచనాపరులుగా తీర్చిదిద్దాలి. సమా జానికి ఉపయోగపడే సృజనాత్మకతను ప్రోత్సహించాలి. ఎందుకంటే భవిష్యత్తులో నిలబడేది గుర్తుంచుకునే విద్య కాదు, ఆలోచించే విద్య. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఏఐ ఆధారిత నిర్ణయ వ్యవస్థల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ మార్పును ముందుగానే అర్థం చేసుకుని సిద్ధమయ్యే విద్యార్థులకే రేపటి ప్రపంచంచెందు తుంది. మార్పుకు భయపడేవారు వెనుకబడిపోతారు. మార్పును స్వీకరించేవారు ముందంజ వేస్తారు. అందుకే ఈ సాంకేతిక సంధికాలాన్ని ఒక ప్రమాదంగా కాకుండా ఒక అపూర్వ అవకాశంగాచూడాలి. నేటి విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం కాకుండా జ్ఞానం కోసం నేర్చుకుంటే, రేపటి ప్రపంచాన్ని నిర్మించే నాయకులుగా ఎదగగలరు. అదే నిజమైన సాంకేతిక స్వర్ణయుగానికి మార్గం.
-డి. అశోక్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: