📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: T20 Blind World Cup: ప్రపంచకప్‌ విజేతగా టీమిండియా..మెరిసిన ఇద్దరు తెలుగమ్మాయిలు

Author Icon By Aanusha
Updated: November 24, 2025 • 9:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు (T20 Blind World Cup) చరిత్ర సృష్టించింది. మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహిళల అంధుల టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్‌లో నేపాల్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. టోర్నమెంట్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా టైటిల్‌ను ముద్దాడింది.

Read Also: Asia Cup Rising Stars 2025: బంగ్లాపై పాక్ గెలుపు

అంధ మహిళల విభాగంలో (T20 Blind World Cup) ఇదే తొలి ప్రపంచకప్ కావడం విశేషం. అయితే ఈ టీమ్‌లో ఇద్దరు తెలుగమ్మాయిలు కీలకంగా వ్యవహరించారు. వారిలో ఒకరు టీమ్ కెప్టెన్ దీపిక, మరొకరు కరుణ కుమారి. అన్ని మ్యాచ్‌లలో వీరిద్దరు అదరగొట్టారు.. భారత్‌ను విశ్వ విజేతలుగా నిలిపారు.దీపకది ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టి గ్రామం.. తల్లిదండ్రులు చిక్కతిమ్మప్ప, చిత్తమ్మ వ్యవసాయ కూలీలు.

ఆమెకు ఐదు నెలల వయసులో గోరు తగలడంతో కంటి చూపును కోల్పోయింది. ఈ అయినా తమ బిడ్డకు మంచి భవిష్యత్తును అందించాలని తల్లిదండ్రులు భావించారు. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు గ్రామం కావడంతో దీపిక కర్ణాటకలో విద్యనభ్యసించింది. నాలుగో తరగతి వరకు స్థానికంగా ఉన్న స్కూల్‌లో చదివింది.

దీపిక భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేవారు

స్కూల్లో తోటి విద్యార్థులు దీపికను అంధురాలని ఏడిపించడంతో బాధపడేది.. తన తల్లిదండ్రులతో తన బాధను పంచుకునేది. దీపిక భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేవారు. ఆమెకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని భావించారు. ఆమెను తీసుకెళ్లి మైసూరు అంధుల పాఠశాలలో చేర్చారు.

ఆమె తల్లిదండ్రులు ఆమెను మైసూరు అంధుల పాఠశాలలో చేర్పించారు. తమ కూలి పనులతో ఆమె చదువుకు, ఇతర అవసరాలకు అండగా నిలిచారు. ఎనిమిదో తరగతి నుంచే దీపిక క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది. క్రికెట్‌లో ఆమె ప్రతిభను గుర్తించి శిక్షణ ఇచ్చారు. పదో తరగతి చదువుతున్నప్పుడే, అంధుల రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని సెంచరీ సాధించి అందరినీ ఆకట్టుకుంది.

కర్ణాటక జట్టుకు కెప్టెన్‌

2019లో అంధుల మహిళల టీమ్ ప్రారంభమైనప్పుడు.. కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. ఆ తర్వాత భారత జట్టులో కూడా స్థానం సంపాదించింది. 2023లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ అంధుల మహిళల క్రికెట్ టీ-20 వరల్డ్‌ గేమ్స్‌ (ఐబీఎస్‌ఏ)లో దీపిక అద్భుతమైన ఆటతీరు కనబరిచింది.

T20 Blind World Cup

ఆమె ఆటతీరుకు మెచ్చి, క్రికెట్ కోటాలో ముంబైలోని ఐటీశాఖలో ఉద్యోగం లభించింది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో దీపిక కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించింది.. టీమ్ గెలుపులో ఆమె కీలక పాత్ర పోషించింది. లీగ్‌ దశలో పాకిస్థాన్‌పై 45 పరుగులు.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 58 బంతుల్లో 91 పరుగులతో అదరగొట్టింది.

పంగి కరుణ కుమారి

టీమిండియా తరఫున ఆడిన మరో తెలుగమ్మాయి పంగి కరుణ కుమారి. అంధత్వం ప్రతిభకు అడ్డంకి కాదని నిరూపించింది.. విశాఖపట్నంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకుంటూ, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, దాతల సహాయంతో భారత్ తరఫున ఆడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలంలోని వంట్ల మామిడికి చెందిన పంగి కరుణ కుమారికి చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అయితే ఆమెకు 80 శాతం అంధత్వం (బి1 విభాగం) ఉండటంతో.. ఆటలో ఇబ్బందులు పడింది. స్కూల్‌లో అక్షరాలను గుర్తించడంలో కష్టాలు పడటంతో, చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

క్రికెట్ పట్ల ఆసక్తి

తనలాంటి పిల్లల కోసం విశాఖపట్నంలో స్కూల్ ఉందని తెలుసుకుని, తల్లిదండ్రులను ఒప్పించి అక్కడి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో చేరింది.అక్కడే కరుణ కుమారికి కోచ్ రవికుమార్ పరిచయమయ్యారు. క్రికెట్ పట్ల తనకున్న ఆసక్తిని ఆయనకు వివరించడంతో, ప్రత్యేక శిక్షణతో క్రికెట్ ఆడవచ్చని కోచ్ చెప్పారు. ఆ మాటలు కరుణకు ఎంతో ఆనందాన్నిచ్చాయి.

అయితే, బి1 విభాగంలో ఉండటం వల్ల, కేవలం శబ్దం ఆధారంగానే బంతిని గుర్తించాల్సి వచ్చేది. దీంతో, ఆటలో తరచుగా దెబ్బలు తగిలేవి. అయినప్పటికీ, ఆమె పట్టు వదలకుండా శిక్షణ పొంది, తక్కువ సమయంలోనే నైపుణ్యాలను అందిపుచ్చుకుంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో జరిగిన పలు మ్యాచ్‌లలో ఆడి, విజయాలు సాధించింది.

ఈ విజయాలే ఆమెకు భారత జట్టులో చోటు సంపాదించి పెట్టాయి. బెంగళూరులో జరిగిన ప్రపంచకప్ సెలక్షన్‌కు వెళ్ళినప్పుడు, 70 బంతుల్లో 114 పరుగులు చేసి సత్తా చాటింది. అవకాశాలను అందుకుని, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, దాతల సహాయంతో భారత్ తరఫున టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు వెళ్లింది. తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Deepika captain India India blind women T20 world cup Indian women cricket Karuna Kumari latest news Telugu News Telugu players achievement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.