📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Teachers: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేరా?

Author Icon By Sudha
Updated: January 29, 2026 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల హక్కులు, బాధ్యతలు, విద్యారంగానికి సంబంధించిన మౌలిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రజాస్వామ్య వేది కలుగా ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఉపాధ్యాయ సంఘాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలు లేకుండా లేదా చాలా కాలం పాటు ఎన్నికలు జరగకుండా, సభ్యుల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, కొద్దిమంది నాయకులే కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కొనసాగడం వలన క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయు ల నిజమైన సమస్యలు సమగ్రంగా ప్రభుత్వానికి చేరడం లేదు. రాజకీయ పార్టీలు లేదా పరిపాలనా యంత్రాంగం సిఫారసులతో శాశ్వత గుర్తింపు పొందిన కొన్ని సంఘాలకు సభ్యుల మద్దతు నిరంతరం అవసరం లేకపోవడం వల్ల నాయకత్వంలో బాధ్యత భావన క్రమంగా తగ్గుతున్నది. ప్రభుత్వం కూడా ఏ అంశంపై చర్చ జరపాలన్నా, సంఘా ల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న అంశాన్ని పక్కనపెట్టి, గుర్తింపు పొందిన సంఘ నాయకులతోనే చర్చలు జరపడం పరిపాటిగా మారడంతో ఉపాధ్యాయ సమాజంలోని విభిన్న స్వరాలు ఆ చర్చల్లో ప్రతిఫలించడం లేదు. ఈ పరిస్థితి సహజంగానే అసంతృప్తికి దారితీస్తూ, వ్యక్తిగత జెండాలతో, కుల, మత, ప్రాంత భావాలతో అనేక గుర్తింపులేని సంఘాలు ఏర్పడేందుకు కారణమవుతోంది. దీని వల్ల ఒకే లక్ష్యంతో పోరాడాల్సిన ఉపాధ్యాయ (Teachers)సమాజం మరింత విభజనకు గురవుతోంది.

Read Also : EPFO: రూ. 25,000కు పీఎఫ్ వేతన పరిమితి పెంపు.. ఏప్రిల్ నుంచి అమల్లోకి?

Teachers

ఒకవైపు ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంఘాలు సభ్యుల పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహ రించకపోవడం, మరోవైపు గుర్తింపు లేని సంఘాలు ప్రభుత్వంతో అధికారికంగా మాట్లాడే అవకాశాలు లేకపోవడం వలన పాఠశాలల వసతులు, పనిభారం, బదిలీలు, పదోన్నతులు, ఉపాధ్యాయుల (Teachers) వ్యక్తిగత సమస్యలు వంటి మౌలిక అంశాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజాస్వామ్యం ఉన్న చోటే బాధ్యత ఏర్పడుతుంది, బాధ్యత ఉన్న చోటే ఫలితాలు కనిపిస్తాయన్న సూత్రాన్ని ఈ సందర్భంలో విస్మదించలేం. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన సంఘాలకు మాత్రమే పరిమిత కాలానికి గుర్తింపు ఇచ్చేవిధానం అమలులో ఉండటం వలన అక్కడి సంఘ నాయకత్వం సభ్యుల సమస్యల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అదేతరహా విధానం ఉపా ధ్యాయ సంఘాల్లో కూడా అమలైతే, నాయకత్వం క్షేత్రస్థాయి ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేసే పరిస్థితిఉండదు. సభ్యుల విశ్వాసం కోల్పోతే నాయకత్వం కూడా కోల్పోవాల్సి వస్తుందన్న అవగాహన సంఘాలను మరింత చురుకుగా, పారదర్శకంగా పనిచేయించే అవకాశముంది. ఈ విధానం ఉపాధ్యాయ సంఘాలను బలహీనపరచడం కాదు, ప్రజా స్వామ్యం పునాదులపై మరింత బలోపేతం చేయడమే. ఇది ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణ కాదు, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం కూడా కాదు. వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే దిశగా ఒక నిర్మా ణాత్మక ఆలోచనను సమాజం ముందుకు తీసుకురావడమే దీని లక్ష్యం. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులైన ప్పుడు, వారి సంఘాలు కూడా ప్రజాస్వామ్య విలువలను ఆచరణలో చూపాల్సిన అవసరంఉంది. విద్యారంగ భవిష్య త్తుకు కూడా దీర్ఘకాలంలో మేలుచేసే అవకాశం ఉంది.
– తరిగోపుల నారాయణస్వామి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News education system latest news School Education teacher problems Teacher Welfare teachers issues Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.