విజయవాడ : అత్యధిక యువ పార్లమెంటేరియన్లు కలిగిన పార్టీ టిడిపి అని, ఈ యువ శక్తి పార్లమెంట్ వేదికగా రాష్ట్ర సమస్యలను స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉందని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం నారా చంద్రబాబు నాయుడు (CHANDRABABU NAIDU) టిడిపి ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు సేవ చేయడమే టిడిపి ఐడియాలజీగా పేర్కొన్న సిఎం… రాష్ట్రాభివృద్ధి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీలు అంతా సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన ముఖ్య మంత్రి రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సి వ్యూహంపై పలు మార్గ దర్శకాలు జారీ చేశారు.
Read also: Mithun Reddy: మిథున్ రెడ్డికి కోర్టులో ఊరట.. సమావేశాలకు అనుమతి
State development and public interest are the agenda
అరటి ధరల పతనం
మొంథా తుఫాన్ నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని చెప్పారు. కృష్ణా-గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, గోదావరి ట్రైబ్యునల్, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్లో రాష్ట్ర గొంతు వినిపించాలని ఎంపీలకు సూచించారు. వంశధార – గోదావరినల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్న నిర్ణయిస్తాయని… నీటి భద్రతే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారాన్ని కోరాలన్నారు. పత్తి, మొక్కజొన్న, అరటి ధరల పతనం, సీసీఐ నియమాల కారణంగా వచ్చిన సమస్యలను కేంద్రానికి వివరించి రైతులకు ఉపశమనం కల్పించేలా చూడాలని ఎంపీలకు సీఎం స్పష్టం చేశారు.
70 శాతం సేవలు ఉచితమని
వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు వంటల మార్పిడికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, హార్టి కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు ఆకట్టుకునేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో సిఎం మాట్లాడుతూ… రాష్ట్రంలో గ్రీన్ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లకు అవసర మైన శక్తి వసతులపై కేంద్ర సహాయం సాధించాలి. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎండ్ పార్కులు, 4బి-5బి కనెక్టివిటీ, క్వాంటం వ్యాలీ, ఇన్నోవేషన్ ఎకో సిస్టము మద్దతు సాధించేలా ఎంపీలు కృషి చేయాలి. విశాఖ-విజయవాడ మెట్రో రైలు, విశాఖ -తిరుపతి-అమరావతి ఎకనామిక్ రీజియన్స్. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్రంతో చర్చలు జరపాలి. పిపిపి మోడల్లో తీసుకొస్తున్న మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ అస్తులేనని, 70 శాతం సేవలు ఉచితమని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. ప్రతిపాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్, విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలపై ఎంపీల సహకారం అవసరం అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: