📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Guntakal : TDP ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్

Author Icon By Sudheer
Updated: May 14, 2025 • 8:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో ఆలూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ (Chippagiri Lakshminarayana) హత్య కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఈ కేసులో గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ(Gummanuru Narayana Arrest)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణను వైద్య పరీక్షల అనంతరం ఆలూరు కోర్టులో హాజరుపరిచిన అధికారులు, ఆయనను 14 రోజుల న్యాయ హిరాసతులోకి పంపించడంతో కర్నూలు జిల్లా జైలుకు తరలించారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హత్య కేసు

ఈ హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్ రికార్డులు, సీసీ కెమెరా దృశ్యాలు తదితరాలను విశ్లేషించిన పోలీసులు, నారాయణ పాత్రపై స్పష్టతకు వచ్చారు. అందులో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నట్లు ఏఎస్పీ హుసేన్ పీరా వెల్లడించారు.

నారాయణ అరెస్ట్ తో టీడీపీ వర్గాల్లో కలవరం

తాజా అరెస్ట్‌తో ఆలూరు ప్రాంతంలో రాజకీయంగా చర్చలకు ఊతం లభించింది. టీడీపీ వర్గాల్లో కలవరం నెలకొనగా, కాంగ్రెస్ నేతలు న్యాయం జరగాలన్న డిమాండ్‌తో ముందుకు వస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు నిష్పాక్షికంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. హత్య వెనుక అసలు కారణాలు, ప్రమేయాలపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

Chippagiri Lakshminarayana murder case Google News in Telugu Gummanuru Narayana Arrest TDP MLA Brother

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.