📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu news: TDP: రోజాపై స్థానిక నేతల ఫైర్.. నగరి రాజకీయాల్లో ముగింపు?

Author Icon By Tejaswini Y
Updated: December 13, 2025 • 2:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TDP Leaders Fire on Roja: మాజీ మంత్రి, వైసీపీ నేత రోజాపై ఆమె సొంత నియోజకవర్గం నగరిలో టీడీపీ(TDP) నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజా రాజకీయంగా ఎదగడం తమ వల్లేనని, ఇప్పుడు ఆమె అహంకారంగా మాట్లాడుతోందని ఆరోపించారు. నగరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పలువురు ఎంపీపీలు రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: Kollikapudi Srinivas: మరోసారి వార్తల్లో తిరువూరు ఎమ్మెల్యే 

రోజా రాజకీయ ప్రస్థానం ముగిసిందని స్పష్టం

ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, నగరిలో రోజా రాజకీయ ప్రస్థానం ముగిసిందని స్పష్టం చేశారు. ఇకపై ఆమె ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశమే లేదన్నారు. ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా న్యాయపరంగానే జరిగాయని తెలిపారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో రోజా స్థాయిని తానే తగ్గించుకుంటోందని విమర్శించారు. నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం ఎదుర్కొన్న నాయకురాలిగా రోజా నిలిచిందని వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని ప్రజలకు చూపిస్తామని హెచ్చరించారు.

TDP: Local leaders fire on Roja.. End of Nagari politics

టీడీపీలో ఉన్నప్పుడే రెండుసార్లు ఓడిపోయిన రోజా

వడమాలపేట జడ్పీటీసీ(ZPTC) మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, రోజా రాజకీయ ఒత్తిడి, అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము పార్టీ మారలేదని, టీడీపీలో ఉన్నప్పుడే రెండుసార్లు ఓడిపోయిన రోజా, తరువాత పార్టీ మారి తమ సహకారంతో ఎమ్మెల్యే అయ్యారని చెప్పారు. 2014కు ముందు, తరువాత రోజా పరిస్థితుల్లో వచ్చిన మార్పులే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

సీనియర్ నేత అమ్ములు మాట్లాడుతూ, తమ సహాయం లేకపోతే రోజా రాజకీయంగా నిలబడలేదన్నారు. రోజా కుటుంబం నగరి ప్రాంతాన్ని ఆర్థికంగా దోచుకుందని ఆరోపించారు. ఆమె అనవసర వ్యాఖ్యలే రాష్ట్రంలో వైసీపీ పతనానికి కారణమయ్యాయని తెలిపారు. ఇకపై అదుపు తప్పిన మాటలు సహించబోమని కఠిన హెచ్చరిక జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Andhra Pradesh politics Nagari politics roja Roja Controversy TDP TDP Leaders Fire on Roja YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.