SVSN Varma Chandrababu Photo Controversy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అవమానం జరిగిందంటూ టీడీపీ సీనియర్ నాయకుడు, పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో చిన్నదిగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించారు.
Read Also: Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి
SVSN Varma Chandrababu Photo Controversy: ఫ్లెక్సీ వివాదం.. అధికారులపై ఆగ్రహం
పిఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం మంగళవారం ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్మ, వేదికపై ఉన్న ఫ్లెక్సీని చూసి అవాక్కయ్యారు. అందులో సీఎం చంద్రబాబు చిత్రం చాలా చిన్నదిగా ఉండటాన్ని గమనించిన ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రికి గౌరవం లేని చోట నేను కూర్చోలేను” అని మున్సిపల్ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ, వేదిక ఎక్కకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.
సొంత పార్టీ నేతలపైనా సీరియస్
బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న టీడీపీ నాయకులపై కూడా వర్మ మండిపడ్డారు. “ముఖ్యమంత్రి ఫోటో గురించి ముందే చూసుకోవాలి కదా.. పార్టీలో ఉంటూ ఏం చేస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడి ఫోటోను రెవెన్యూ స్టాంప్ అంత చిన్నదిగా ముద్రించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదారు సార్లు ఇలాగే జరిగింది
అనంతరం మీడియాతో మాట్లాడిన వర్మ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. “గతంలో సంక్రాంతి సంబరాల్లోనూ ఇలాగే జరిగింది. దాదాపు ఐదారుసార్లు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ నేను వేదిక ఎక్కినా, కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు” అని వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: