ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు ఎం.ఎ. షరీఫ్ (M.A. Sharif) తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్నూలులో జరిగిన వక్ఫ్ చట్ట సవరణ వ్యతిరేక సభలో ఒవైసీ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.మతపరమైన సభకు వచ్చి, టీడీపీని టార్గెట్ చేయడం సమంజసమా? అని షరీఫ్ ప్రశ్నించారు. ముస్లింల సమస్యలపై మాట్లాడటానికి వచ్చిన నేత రాజకీయ వ్యాఖ్యలు చేయడం వెనుక ప్రయోజనాలే ఉన్నాయని ఆయన ఆరోపించారు.వక్ఫ్ సభలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దని, జగన్ రెడ్డిని గెలిపించమని ఒవైసీ చెప్పిన మాటలు చూసి సభ వైసీపీ వేదికగా మారిందని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇది అసలు ఉద్దేశాన్ని మరుగునపెట్టడమేనని విమర్శించారు.
2019–24 మధ్య దాడులు.. ఒవైసీ ఎక్కడ?
వైఎస్సార్‌సీపీ పాలనలో ముస్లింలపై దాడులు, హత్యలు జరిగినప్పుడు ఒవైసీ ఎక్కడ ఉన్నారని షరీఫ్ ప్రశ్నించారు. అప్పుడు స్పందించలేదేం? ఒక్కసారి అయినా ఖండించలేదేం? అంటూ అసహనం వ్యక్తం చేశారు.తెలంగాణలో ముస్లింల ఓట్లను విడగొట్టకుండా ఉండేందుకు మాత్రమే పాతబస్తీ వరకు పరిమితమవుతున్నారని, ఉత్తరాదిలో మాత్రం అభ్యర్థులు పెట్టి ముస్లింల ఓట్లను చీలుస్తున్నారని ఆరోపించారు. ఇది పరోక్షంగా కొన్ని పార్టీలకు లాభం చేకూర్చేలా ఉన్నది అని చెప్పారు.
టీడీపీ అంటే ముస్లింలకు గౌరవమే
మేము 30 ఏళ్లుగా టీడీపీలో ఉన్నాం. మా హక్కుల కోసం పార్టీతోనే పోరాటం చేస్తున్నాం అని షరీఫ్ చెప్పాడు. వక్ఫ్ చట్టంపై కేంద్రం తీసుకొచ్చిన మార్పులకు టీడీపీ తడబడలేదని గుర్తు చేశారు.చంద్రబాబు నాయుడు ముస్లింల మేధావులతో చర్చించి అభిప్రాయాలు కేంద్రానికి చెప్పారని, ఆ కృషి వల్లే కొన్ని విభేదాస్పద అంశాలు వక్ఫ్ బిల్లులో తొలగించబడ్డాయని తెలిపారు. ముస్లింల ఆస్తులు, మత స్థలాల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని షరీఫ్ హామీ ఇచ్చారు.
Read Also : Revanth Reddy : తెలంగాణ జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు: రేవంత్ రెడ్డి