📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

విజయవాడలో ఆ రోడ్డు పేరును మార్చిన టీడీపీ

Author Icon By Vanipushpa
Updated: February 10, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడలో మరో రోడ్డు పేరుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో గతంలో ఉన్న మహానాడు రోడ్డు పేరును యథాతథంగా ఉంచాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక టీడీపీ నేత దేవినేని అవినాష్ ప్రోద్బలంతో మహానాడు రోడ్డు పేరును దేవినేని రాజశేఖర్ రోడ్డు పేరుగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ రోడ్డుకు మహానాడు పేరు కొనసాగించాలని స్థానికుల నుంచి భారీగా విజ్ఞప్తులు ప్రభుత్వానికి వచ్చాయి. విజయవాడలో ఆ రోడ్డు పేరును మార్చిన టీడీపీ.విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు స్థానికుల విజ్ఞప్తితో పాటు రోడ్డు చరిత్రను వివరిస్తూ మున్సిపల్ కమిషనర్‌కు లేఖ కూడా రాశారు. వెంటనే ఈ లేఖపై స్పందించి రికార్డును పరిశీలించారు. అలాగేమున్సిపల్ కమిషనర్ సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. కౌన్సిల్ తీర్మానం వివాదాస్పదంగా ఉండటంతో ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ ఆంధప్రేదశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సెక్షన్ 679ఏ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1995 ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవోను జారీ చేశారు.


1990లో నేషనల్ హైవే 16 నుంచి బల్లెంవారి వీధి వరకు మున్సిపల్ కార్పొరేషన్‌లోకి కలిసింది. ఆ తర్వాత ఈ రోడ్డు పేరును మహానాడు రోడ్డు స్థానికులు పిలిచేవారు. స్థానికంగా గుర్తింపు కోసం, అడ్రస్, ల్యాండ్ మార్క్‌‌గా మహానాడు రోడ్డుగా మారింది. ఆ తర్వాత కార్పొరేటర్లు తమ కౌన్సిల్ ఎజెండాలో మహానాడు రోడ్డుకు సంబంధించి అనేక మౌలిక సదుపాయాల పనులను సిఫార్సు చేశారు. అందుకు బదులుగా మున్సిపల్ కార్పొరేషన్ కూడా మహానాడు రహదారి పేరుతో అనేక ప్రతిపాదనలను ఆమోదించింది.

ఈ మహానాడు రోడ్డు పేరు విషయంలో ప్రజల విజ్ఞప్తులు, చర్చలు, మరియు ప్రభుత్వ చర్యలు విజయవాడలోని ప్రజల ఆందోళనను ఎక్కువగా పెంచాయి. ప్రజల అభ్యర్థన మేరకు ఈ రోడ్డు పేరు యథాతథంగా ఉంచడం, వారి ఆత్మగౌరవాన్ని కూడా పెంచింది. దీనితో పాటు, ఈ రోడ్డు చరిత్రను గమనిస్తూ, ప్రజల సంతోషానికి అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజలతో ప్రభుత్వానికి మధ్య అవగాహన పెరిగే దిశగా సూచనగా ఉంది. రోడ్డు పేరు మార్పిడి సంబంధించి గతంలో జరిగిన వివాదం, ప్రజల ఆందోళనను లేవనెత్తి, దానిని తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల హితాల కోసం ప్రభుత్వ ప్రవర్తనను కూడా వివరించి, స్థానికులలో నమ్మకాన్ని పుట్టించింది. ఇదే విధంగా, మరికొన్ని స్థానిక పరిష్కారాలకు కూడా ప్రభుత్వం ఇలాంటి స్పందన చూపించి ప్రజల సమస్యలను తీర్చాలని ప్రక్షిప్త వ్యక్తుల భావన ఏర్పడింది.

Breaking News in Telugu devineni rajasekhar road Google news Google News in Telugu Latest News in Telugu mahanadu road Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.