📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: TamilNadu: ఏపీ యువతిపై గ్యాంగ్‌రేప్.. కానిస్టేబుళ్ల ను విధుల నుంచి సస్పెండ్ చేసిన డీఎంకే ప్రభుత్వం

Author Icon By Aanusha
Updated: October 2, 2025 • 7:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని అరుణాచలం సమీపంలో చోటుచేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కు చెందిన ఓ యువతిపై ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో సంచలనం రేగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులుగా ఉన్న సుందర్, సురేశ్ రాజ్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. తాజాగా సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Bollywood : సినిమా అవకాశాల్లేక డ్రగ్స్ దందా.. దొరికిపోయిన బాలీవుడ్ నటుడు

పోలీసులే అత్యాచారానికి తెగబడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమిళనాడులో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎడిప్పాడి పళనిసామి స్పందిస్తూ.. సోదరిపై పోలీసులు అత్యాచార ఘటన సభ్యసమాజానికి సిగ్గుచేటని మండిపడ్డారు.ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వం (DMK Govt) .. కానిస్టేబుళ్లను విధుల నుంచి తప్పించింది.

సోమవారం (సెప్టెంబరు 29న) రాత్రి తమిళనాడులోని ఎంథాల్ బైపాస్ వద్ద గస్తీలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లు సురేశ్, సుందర్‌లు.. టమాటాలు లోడుతో వెళ్తున్న ట్రక్కును ఆపి తనిఖీలు చేశారు. ఈ సమయంలో వాహనంలో ఉన్న ఇద్దరు మహిళలను వారు గమనించారు. అనుమానం ఉందని, కిందకు దిగాలని ఆదేశించారు.

యువతిని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు

కానీ, వారు దిగపోయేసరికి కొట్టి బలవంతంగా కిందకు దింపేశారు. దీంతో భయపడిపోయిన ట్రక్కు డ్రైవర్ ఆ ఇద్దరు తల్లీకూతుళ్లను వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.తర్వాత వారి ఇద్దర్నీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తామని చెప్పి, కానిస్టేబుళ్లు జీపు ఎక్కించారు.

TamilNadu

కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఓ గోతి తల్లిని తోసేసిన కామాంధులు.. యువతిని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. సెప్టెంబరు 30న తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్థానికులు ఆ యువతిని గుర్తించి, అంబులెన్స్‌లో ఆసుపత్రి (Hospital) కి తరలించారు. 

నిందితులను సుందర్, సురేశ్ రాజ్‌లుగా గుర్తించారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న తిరువన్నామలై (Tiruvannamalai) ఎస్పీ సుధాకర్, ఇతర అధికారులు ఆసుపత్రిలోని బాధితురాలిని పరామర్శించారు. ఆమె చెప్పిన వివరాలు ఆధారంగా నిందితులను సుందర్, సురేశ్ రాజ్‌లుగా గుర్తించారు.

ఇరువురిపై అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, నిందితులను అదే రోజు అరెస్ట్ చేశారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే ఇంతటి దారుణానికి పాల్పడటంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

AP Girl Rape in Tamil Nadu Arunachalam Police Rape Case Breaking News latest news MK Stalin Action on Police Tamil Nadu Police Crime Telugu News TN Government Suspends Constables

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.