📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tamilnadu Assembly Elections: విజయ్ – బీజేపీ పొత్తుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

Author Icon By Anusha
Updated: March 16, 2026 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tamilnadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అక్కడి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, అధికార డీఎంకే కూటమిని ఢీకొట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read Also: Tamilnadu: డీఎంకే సర్కార్‌పై నటి గౌతమి ఫైర్

80 సీట్లు.. డిప్యూటీ సీఎం ఆఫర్?

విజయ్ ఇప్పటికే ఒంటరి పోరు అని ప్రకటించినప్పటికీ, బీజేపీ ఆయనకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. టీవీకేతో పొత్తు కుదిరితే 80 అసెంబ్లీ సీట్లతో పాటు, అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవిని కూడా ఆఫర్ చేసినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే దీనిపై టీవీకే నేత సెంగొట్టయాన్ ఇప్పటికే స్పందిస్తూ, అది కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

Tamilnadu Assembly Elections: Pawan Kalyan’s clarity on Vijay – BJP alliance

మధ్యవర్తిగా పవన్ కళ్యాణ్? జనసేనాని ఏమన్నారంటే..

ఈ పొత్తు చర్చలను విజయ్‌తో జరిపే బాధ్యతను బీజేపీ అధిష్టానం ఎన్డీయే భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్కు అప్పగించిందనే వార్త గత కొద్దిరోజులుగా వైరల్ అవుతోంది. దీనిపై పవన్ కళ్యాణ్ తాజాగా ఒక తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్ధలు కొట్టారు.తనవైపు నుంచి అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తనకు తెలియదన్నారు. విజయ్ ను తాను కలిసి పాతికేళ్లు అవుతుందన్నారు. దీంతో పవన్ మధ్యవర్తిత్వం పుకార్లకు చెక్ పడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pawan Kalyan on Vijay TVK tamil nadu assembly elections 2026 Vijay BJP Alliance Rumors

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.