📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Thalliki Vandanam : జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

Author Icon By Sudheer
Updated: May 15, 2025 • 9:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) తన పాలనకు ఏడాది పూర్తయ్యిన సందర్భంగా జూన్ 12న ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతుంది. ఈ సందర్భంగా “తల్లికి వందనం” (Thalliki Vandanam ) మరియు “అన్నదాత సుఖీభవ” (Annadata Sukhibhava ) అనే రెండు ప్రధాన పథకాలను మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు, తల్లుల ప్రోత్సాహాన్ని పెంపొందించేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం.

మూడవ విడతల్లో మొత్తం రూ.20,000 సహాయం

ఇక రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో మూడవ విడతల్లో మొత్తం రూ.20,000 సహాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా పంటల పెట్టుబడుల భారాన్ని తగ్గిస్తూ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అంకితభావంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు వ్యవసాయాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అచ్చెన్నాయుడు తెలిపారు.

లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు

అదే రోజున మరో ముఖ్యమైన పథకంగా, లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పథకం ద్వారా సామాజికంగా వెనుకబడి ఉన్న మహిళలకు భద్రతా కవచం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రతి నెలా అమలయ్యే సంక్షేమ పథకాల వివరాలతో పాటు ఏడాది మొత్తం కోసం సంక్షేమ క్యాలెండర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

Read Also : War : చైనా, పాకిస్థాన్.. మీ బుద్ధులు మారవా?

Google News in Telugu talliki vandanam Talliki Vandanam Scheme update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.