Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం తన పాలనలో ప్రజల అభివృద్ధికి దోహదపడే పలు పథకాలతో ముందుకువెళ్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం మొదలుపెట్టింది.
ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకువెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా సూపర్ సిక్స్ పథకాల్లొ ఒకటైన తల్లివందనం (Talliki Vandanam) పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇప్పటికే విద్యార్థుల తల్లుల ఖాతాలోకి నగదు జమ చేసింది. టిడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకాశంజిల్లా మార్కాపురంలో పూర్తిస్థాయిలో నెరవేరినట్టయింది.
తల్లికి వందనం — ఒక మార్పును తీసుకువచ్చిన పథకం
ఈ పథకం ప్రకారం విద్యార్థుల చదువును ప్రోత్సహించడానికి వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేస్తోంది. ఇది విద్యను ప్రోత్సహించడమే కాకుండా తల్లిదండ్రుల ఆర్థిక భారం తగ్గించడానికీ సహాయపడుతోంది. ఒక్కో విద్యార్థికి రూ. 15,000 చొప్పున ఇవ్వబడుతున్న ఈ సాయం ఇప్పుడు ఎంతోమంది కుటుంబాలకు నిజమైన అండగా మారింది.
ఒకే కుటుంబంలో ఐదుగురికి లభించిన అదృష్టం
ప్రకాశంజిల్లా మార్కాపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. విద్యార్థులు అంకాలు, వీరాంజనేయులు, శివ కేశవ, వెంకటస్వామి, సాయి పల్లవికి తల్లికి వందనం పథకం కింద మొత్తం రూ. 75 వేలు వారి తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో ఆ కుటుంబ ఆనందానికి అంతులేకుండా పోయింది. 18 వ వార్డులో నివాసం ఉంటున్న ఆవుల శ్రీను, అల్లూరమ్మ దంపతుల కుటుంబానికి తల్లికి వందనం పథకం కింద నగదు జమ అయింది.
హామీని నిలబెట్టుకున్న చంద్రబాబు
ఈ సంతోష సమయంలో విషయాన్ని తెలుసుకున్న స్థానిక టిడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. లబ్ధిదారుల నివాసానికి వెళ్లి వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. అలాగే ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు.
Read also: Visakha Metro: డబుల్ డెక్కర్ విధానంలో విశాఖ మెట్రో