📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ప్రతిభావంతులు ఏపీలోనే అభివృద్ధి చెందుతారు: చంద్రబాబు

Author Icon By sumalatha chinthakayala
Updated: February 21, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెదురుబుట్టలు, విసనకర్రలు తయారు చేసి అమ్ముతూ ఉపాధి

అమరావతి: శ్రీకాకుళంలోని మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్‌కు వలసొచ్చి బుట్టలు నేస్తూ జీవిస్తోన్న ఓ వృద్ధుడి కథ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కదిలించింది. ‘ఈయన కథ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పనితీరుకి నిదర్శనం. అవకాశాల కోసం ఊరు వదిలిపెట్టడం బాధాకరం. హస్తకళలను నేను ఎంతో ఆరాధిస్తా. మన రాష్ట్రాన్ని పునర్నిర్మించి అవకాశాలు సృష్టిస్తాం. ఆయనలాంటి ప్రతిభావంతులు ఇక్కడే అభివృద్ధి చెందుతారు’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. కాగా, హైదరాబాద్ కు వలసవెళ్లి అక్కడే వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తులు తయారు చేస్తూ జీవిస్తున్న వైనాన్ని హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్టు చేసింది.

ఏదేమైనా ఆ వ్యక్తి పనితనం, ఆశావహ దృక్పథం

ఇది ఒక స్ఫూర్తిదాయక జీవితపాఠం అని కొనియాడారు. అతడి కథను పరిశీలిస్తే కష్టించి పనిచేసే స్వభావం, ఏపీ వాణిజ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. కానీ, అతడు సొంతగడ్డను వదిలి అవకాశాలను వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లడం తనను విచారానికి గురిచేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఏదేమైనా ఆ వ్యక్తి పనితనం, ఆశావహ దృక్పథం బాగా నచ్చాయని… తన కలలను, కళను కలగలిపి వస్తువులుగా మలిచి జీవనం సాగిస్తుండడాన్ని ప్రగాఢంగా అభిమానిస్తున్నానని వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్ నిర్మించడానికి, అవకాశాలను సృష్టించడానికి కృషి చేస్తోంది. ఆ వ్యక్తిలా నైపుణ్యం ఉన్న వారు స్వస్థలంలోనే ఉంటే ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తాం” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Ap Breaking News in Telugu CM chandrababu Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.