JC Prabhakar Reddy: తాడిపత్రి ఆలయ పర్యాటక వలయంతో మహర్దశ

Follow Us: Google News Daily Hunt
Mahardasha with Tadipatri Temple Tourist Circle
Mahardasha with Tadipatri Temple Tourist Circle
FONT SIZE
GET APP

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా ఆలయ పట్టణమైన తాడిపత్రికి పర్యాటకపరంగా మహర్దశ పట్టనుందని తాడిపత్రి పురపాలక తాజా మాజీ అధ్యక్షులు శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. సుమారు 250 కోట్ల తో పర్యాటక అభివృద్ధికి ప్రాథమిక నివేదిక సిద్ధమైందని ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపి కార్యాచరణను అమలు చేస్తామని ఆయన చెప్పారు. తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి సన్నిధి మరియు శ్రీ చింతల వెంకటరమణ స్వామి గుడి ప్రధాన ఆకర్షణగా తాడిపత్రి పర్యాటక వలయాన్ని రూపొందిస్తున్నామని అందుకు సంబంధించి ఒక ప్రాథమిక నివేదిక తయారైందని వెంకటరమణ స్వామి సన్నిధిలో జరిపిన పూజల అనంతరం తెలిపారు. శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయం వద్ద సౌండ్ అండ్ లైట్ షో, వెంకటరమణ స్వామి సన్నిధి సమీపంలో లేజర్ షో, పురావస్తు శాఖ ప్రదర్శనశాల, ధార్మిక సదస్సు మందిరం, ఆలూరు కోన వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో పర్యాటక వలయం ఒక గొప్ప పాత్ర పోషించనుందని జెసి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Read also: Gas Shortage: విశాఖ తీరానికి చేరిన భారీ గ్యాస్ నౌకలు

Mahardasha with Tadipatri Temple Tourist Circle

Mahardasha with Tadipatri Temple Tourist Circle

JC Prabhakar Reddy: అత్యాధునిక హంగులతో ఆధ్యాత్మిక కేంద్రం

పర్యాటక వలయం ప్రాథమిక నివేదికను శ్రీ వెంకటరమణ స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పర్యాటక నిపుణుడు మరియు చరిత్రకారుడు మైనాస్వామి మాట్లాడుతూ పర్యాటక వలయం అమలు జరిగిన తర్వాత తాడిపత్రి మరియు పరిసర ప్రాంతాల రూపురేఖలు సమూలంగా మారిపోతాయని, ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని వివరించారు. పర్యాటక వలయం నివేదిక తయారు చేయడానికి తనకు అవకాశం కల్పించిన ప్రభాకర్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రమోహన్, చరిత్ర పరిశోధకుడు పెనుకొండ శ్రీధర్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు