నూతన సంవత్సర వేళ తాడిపత్రి(Tadipatri)లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్షకు దిగడంతో పట్టణం అంతా ఉత్కంఠతో నిండిపోయింది. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసుకొని ఆయన దీక్ష ప్రారంభించారు.
Read Also: 2025 : 2025లో సంతృప్తినిచ్చిన జ్ఞాపకాలు ఇవే అంటూ లోకేశ్ ట్వీట్
నిజాయితీగా, మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించే నేతగా పేరుగాంచిన జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)కి అధికార, ప్రతిపక్ష భేదం లేదని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే మున్సిపల్ ఛైర్మన్‌గా కొనసాగుతూ నిరాహార దీక్ష చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
తాడిపత్రి అభివృద్ధి కోసం మున్సిపల్ చైర్మన్ దీక్ష
తన ప్రవర్తనపై ప్రజల్లో ఏర్పడిన భిన్నాభిప్రాయాల నేపథ్యంలోనే ఈ నిరాహార దీక్ష చేపట్టినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తాను కొన్ని సందర్భాల్లో ఎందుకు అలా స్పందించాల్సి వస్తుందో ప్రజలకు వివరించేందుకే ఈ ఉద్యమం ప్రారంభించానని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తానని, అవసరమైతే తన ప్రవర్తనలో మార్పు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
అలాగే 2026 నాటికి తాడిపత్రిని మరింత అభివృద్ధి చేయాలన్న తన ఆశయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, వాటికి ఖర్చు చేసిన నిధుల వివరాలను ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు చూపించారు. ప్రతి రూపాయికి లెక్క చెప్పేందుకు తాను సిద్ధమని, ప్రజలకు ఏవైనా సందేహాలుంటే నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. తాడిపత్రి ప్రజలే తనకు రాజకీయాలకు మించినవారని, వారి నమ్మకమే తనకు బలమని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: