📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP ACB Trap: ఎసిబి వలలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్

Author Icon By Rajitha
Updated: March 18, 2026 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిపోర్టు ఇచ్చేందుకు రూ.50,000 లంచం తీసుకుంటూ దొరికిన వైనం

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఏసీబీ వరుస దాడులు చేస్తున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఉద్యోగి 50,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు పట్టుబడటం మంగళవారం చోటుచేసుకుంది. జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతి పేరుకుపోయిందని పలుమార్లు ప్రభాతవార్త వార్తలు ప్రచురించింది. ఈ క్రమంలో తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ విభాగంలో చక్రం తిప్పుతున్న పెద్ద చేపను ఏసీబీ అధికారులు టార్గెట్ చేశారు భూమిని కొలవడానికి సరిహద్దులు గుర్తించడానికి లే అవుట్లను నిర్ధారించడానికి కొలతలు వేసేందుకు నాకెంత, రిపోర్టు ఇవ్వడానికి నాకు ఎంత అంటూ అవినీతి సొమ్ము కూడబెట్టుతూ వస్తున్న తాడేపల్లిగూడెం పొరపాలక సంఘం సర్వేయర్ రౌతు రామకృష్ణ లంచం సొమ్ముతో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఎంతోకాలంగా సర్వేయర్ రౌతు రామకృష్ణ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి భూ సర్వేలకు అందుకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు భూ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము డిమాండ్ చేసే వారనే ఆరోపణలు ఎప్పటినుంచో వినవస్తున్నాయి.

Read also: Jagan : బీజేపీతో జగన్ అక్రమ పొత్తు – షర్మిల

AP ACB Trap: Town Planning Surveyor Caught in ACB Net

భూ యజమానులు తమ పనులు త్వరితగతిన చేయించుకునేందుకు సర్వేయర్ రామకృష్ణ అడిగింది ఇవ్వక తప్పని పరిస్థితి దీంతో ఆయన ఉద్యోగం కొలతలు కొద్ది లక్షలు కొద్దీ కొనసాగుతోంది. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన కడకట్లలో కమ్ముల రాధకు 1800 చదరపు గజాలు స్థలం ఉంది. ఆమే ప్రస్తుతానికి ఏలూరులో నివాసం ఉంటుంది. తన స్థలానికి చెందిన సర్వే రిపోర్ట్ కావాలని సర్వే రామకృష్ణను పలుమార్లు అడిగి చూసింది. అడిగిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెబుతూ రోజులు గడుపుతూ వచ్చారు. ఈ క్రమంలో రాధ తాడేపల్లిగూడెం చెందిన ఒక వ్యక్తిని ఆశ్రయించింది సర్వే రిపోర్ట్ అందుకు కెనడి అనే వ్యక్తి సర్వేయర్ రౌతు రామకృష్ణతో మాట్లాడగా రిపోర్టు ఇవ్వడానికి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కెనెడి ఏలూరు ఏసీబీ అధికారులను సంప్రదించారు. మంగళవారం సర్వేయర్ ఇంట్లోనే లంచం ఇస్తుండగా ఏసీబీ డి.ఎస్.పి జీవి కృష్ణారావు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు ఎం బాలకృష్ణ కే శ్రీనివాస్ ఇతర అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఎసిబి అధికారులు రామకృష్ణ ఇంటిని కార్యాలయాన్ని సోదా చేశారు. రామకృష్ణను అరెస్టు చేసి విచారణ అనంతరం రాజమండ్రి రిమాండ్ కు తరలిస్తారని తెలిసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ACB anti corruption bureau Corruption latest news Tadepalligudem Municipality Telugu News Town Planning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.