పిల్లలకు విద్యాబుద్ధలు నేర్పించి, వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన టీచర్లే వికృత చేష్టలకు పాల్పడితే తగిన శిక్షకు(Suspension) గురికావాల్సిందే. తల్లిదండ్రులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తమ పిల్లలను స్కూలుకు పంపిస్తారు. చక్కగా చదువుకుని, తమను ఉద్దరిస్తారనే కొండంత ఆశతో స్కూలుకు పంపిస్తారు. ఉపాధ్యాయులపై ఎనలేని గౌరవాన్ని చూపిస్తారు. అంతెందుకు సమాజంలో కూడా ఉపాధ్యాయులపై ఒక ప్రత్యేక గౌరవం ఉంది. అలాంటి టీచర్లు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి, పిచ్చివేషాలు వేస్తే అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని ఈ ఉదంతం తెలుపుతున్నది.
Read also: టాలీవుడ్ వర్కింగ్ స్టైల్‌పై సోనాక్షి కామెంట్స్
సర్వత్రా విమర్శలతో చర్యలు తీసుకున్న అధికారులు
శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) మెళియాపుట్టి మండలం బందపల్లి బాలిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ ఎంగా పనిచేస్తున్న సుజాత ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో సదరు ఉపాధ్యాయురాలు(Suspension) ఎంతో హుందాగా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కుర్చీలో కూర్చిని ఉండగా ఇద్దరు విద్యార్థినులు నేలపై మోకాళ్లపై కూర్చుని ఆమె కాళ్లు నొక్కడం వీడియోలో కనిపించింది. ఆమె తీరుపై సర్వాత్రా విమర్శలతో పాటు విధుల నుంచి తొలగించాలనే డిమాండ్ పెరిగింది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఉపాధ్యాయురాలు సుజాతను సస్పెండ్ చేస్తూ పీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక సుజాతపై విచారణ పూర్తయ్యేవరకూ ఆమెపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: