ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన ఘనతను రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) గుర్తు చేశారు. విశాఖపట్నంలో 25 వేల గిరిజన విద్యార్థులు ఒకేసారి 108 సూర్యనమస్కారాలు చేయడం ద్వారా చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ విజయం ప్రపంచ దృష్టిని విశాఖ వైపు తిప్పిందని, ఇది మనందరికీ గర్వకారణమని లోకేశ్ వ్యాఖ్యానించారు.జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి (For Yoga Day) ముందు రోజు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 25 వేల మంది గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు. 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేస్తూ ప్రపంచ రికార్డు సాధించేందుకు ప్రయత్నించారు. ఇది నిజంగా అద్భుతం అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థికి హృదయపూర్వక ధన్యవాదాలు
విద్యార్థుల పట్టుదల, క్రమశిక్షణను అభినందించిన లోకేశ్, ఒక పిలుపుతో ఈ స్థాయిలో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. ఈ రికార్డు శనివారం అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. విద్యార్థులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున శుభాకాంక్షలు తెలిపారు.యోగా కేవలం ఆసనాలు కాదు, అది జీవన విధానం అని లోకేశ్ అన్నారు. తాను చిన్నప్పటి నుంచి చంద్రబాబు ద్వారా యోగాకు అలవాటు పడ్డానని చెప్పారు. అదే క్రమశిక్షణ, పట్టుదల ఇప్పుడు ఈ విద్యార్థుల్లో కనిపించిందని కొనియాడారు.
ప్రధాని మోదీకి కానుకగా గిన్నిస్ రికార్డు
విశాఖకు ప్రధాని మోదీ రెండోసారి వస్తున్నారని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత, రైల్వే జోన్ మంజూరు, అమరావతి పనుల పునఃప్రారంభం – ఇవన్నీ ఆయన సహకారంతో సాధ్యమయ్యాయని అన్నారు. ఈ విజయం ప్రధానికి అంకితమన్నారు.విద్యార్థుల క్రమశిక్షణను చూస్తుంటే తన కుమారుడు దేవాన్ష్ గుర్తొచ్చాడని లోకేశ్ అన్నారు. ఇలాంటి విలువలు ప్రతి బిడ్డకు నేర్పించాల్సిన అవసరం ఉందని భావం పంచుకున్నారు.
Read Also : YS Jagan: జగన్‌పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి