📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Suresh Babu:అనర్హత వేటు తర్వాత తొలిసారి స్పందించిన సురేశ్ బాబు

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 6:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కడప మాజీ మేయర్, వైసీపీ నేత సురేశ్ బాబు (Suresh Babu) మీడియాతో మాట్లాడుతూ తనపై ఉన్న అవినీతి ఆరోపణలకు స్పందించారు. “నాకు ఒక్క రూపాయి అవినీతి చూపిస్తేనే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటా” అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆయనను చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశంగా మార్చేశాయి. సురేశ్ బాబు చెప్పినట్లుగా, రాష్ట్ర ప్రభుత్వం తనపై అనర్హత వేటు విధించిన తర్వాత ఇది మొదటి సారిగా మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అధికార కూటమి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Shyamala-పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు

తనపై, అంజాద్ బాషాపై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ జిల్లా నేత వాసు వ్యాఖ్యలపై సురేశ్ బాబు తీవ్రంగా స్పందించారు. 2014-19 మధ్య టీడీపీ (TDP) ప్రభుత్వం నీరు-చెట్టు, బుగ్గవంక సుందరీకరణ పనుల పేరుతో ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచుకుతిన్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కడప అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాలేకపోయిందని విమర్శించారు.

Suresh Babu

కనీసం కార్పొరేటర్, సర్పంచ్ కూడా కాని వ్యక్తి అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి (Madhavi Reddy) తీరుపై కూడా సురేశ్ బాబు మండిపడ్డారు. ఆమెకు నగరాభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదని, కేవలం కార్పొరేషన్‌లో తన కుర్చీ కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు.

స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించారని

కార్పొరేషన్ నిధులతో మున్సిపల్ పాఠశాలల్లో (municipal schools) ఏర్పాటు చేసిన విద్యా వాలంటీర్ల నియామక తీర్మానాన్ని ఎమ్మెల్యే అడ్డుకోవడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కొందరు కార్పొరేటర్లు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించారని సురేశ్ బాబు అన్నారు. తనను రాజకీయంగా అడ్డు తొలగించుకోవాలనే కుట్రతోనే అనర్హత వేటు (Disqualification) వేయించారని ఆరోపించారు. అయితే, ఎన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్యేను మేయర్ కుర్చీలో కూర్చోనివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. తన కుటుంబం పేరిట అభివృద్ధి పనులు కేటాయించారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. అది అధికారుల తప్పిదం వల్లే జరిగిందని వివరణ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anjad Basha Breaking News Corruption Allegations Kadapa development Kadapa former mayor latest news Political Challenge Suresh Babu TDP leader Vasu Telugu News YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.