📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Viveka murder case: సునీతారెడ్డి, అల్లుడిపై కేసులను క్వాష్‌ చేసిన సుప్రీం కోర్టు

Author Icon By Vanipushpa
Updated: August 19, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(VivekanadReddy) హత్య కేసు నిందితుల బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టు(Suprem Court)లో మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్‌.కె. సింగ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి (Avinash Reddy)బెయిల్ రద్దు చేయాలంటూ.. సునీత తరఫు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సమయం లోపు దర్యాప్తును ముగించాలని గడువు విధించినందు వల్లే హత్య కేసులో దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు. హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీతతోపాటు, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అప్పటి సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం వివరించింది.

Viveka murder case: సునీతారెడ్డి, అల్లుడిపై కేసులను క్వాష్‌ చేసిన సుప్రీం కోర్టు

నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారు: లూథ్రా
వివేకా హత్య కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందని లూథ్రా అభిప్రాయపడ్డారు. నిందితులు సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని లూథ్రా కోర్టుకు వెల్లడించారు. సునీత దంపతులతోపాటు రాంసింగ్‌పైనా కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని వివరించారు. దీంతో ఆ కేసులను సుప్రీంకోర్టు క్వాష్‌ చేసింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు. ‘‘నిందితులను కాలపరిమితి లేకుండా జైలులో ఉంచడం మంచిది కాదన్నారు. కానీ.. హత్య తీరు చూస్తే నిందితులకు 2, 5 ఏళ్లు చాలా తక్కువే అనిపిస్తోందన్నారు. ఆధారాలు చెరిపేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైంది. వివేకాకు ముందు గుండెపోటు వచ్చిందని.. తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారన్నారు.
కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదనలు వినిపించారు..‘‘నిందితుడు శివశంకర్‌ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్‌ క్యాంప్‌ పేరుతో కడప జైలుకు వెళ్లారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఫొటోలతో సహా ఉన్నాయి. జైలుకెళ్లి అప్రూవర్‌ దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయి’’ అని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సీబీఐ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అవినాష్ రెడ్డే వివేకా హత్యలో మాస్టర్ మైండ్ అని ధర్మాసనానికి తెలిపారు.
చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే కేసు: సుప్రీం
ఈ మేరకు తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని ధర్మాసనం సీబీఐని కోరింది. దర్యాప్తులో నిందితులను కస్టోడియల్‌ విచారణ చేయాలో వద్దో కూడా చెప్పాలని పేర్కొంది. ఎంత మంది నిందితుల బెయిల్‌ రద్దు చేయాలన్న విషయాన్నీ చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా కూతురు, అల్లుడు సునీతా రెడ్డి, నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్‌పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వివేకా కూతురు, అల్లుడిపై కేసు పెట్టారని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.


వివేకానంద రెడ్డి మరణానికి కారణం ఏమిటి?

హత్య. పోస్ట్‌మార్టం నివేదికల ప్రకారం, వివేకానంద రెడ్డి దారుణంగా హత్య చేయబడి, 2019 మార్చి 15న కడపలోని తన నివాసంలో కనుగొనబడ్డాడు. ఈ మరణం మొదట గుండెపోటుగా నివేదించబడింది, కానీ తరువాత హత్యగా తేలింది, ఇది మరింత అనుమానాలకు దారితీసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/minister-ponnam-prabhakar-we-will-provide-free-electricity-to-ganesh-mandapams-minister-ponnam/telangana/532737/

case quash Indian Judiciary legal cases Sunita Reddy Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.