TTD Laddu Case: టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న కమిటీ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read Also: AP Inter Exams 2026: ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: లోకేష్
కోర్టులో ఏం జరిగింది?
సిట్ (SIT) నివేదికపై నియమించిన ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇరుపక్షాల వాదనలను విన్నది. ప్రభుత్వం తరపు వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, ఏకసభ్య కమిటీ తన దర్యాప్తును యథావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను తేల్చే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రభుత్వ విచారణా కమిటీపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఊరటగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: