📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Supplementary Exams: రేపటి నుండే ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

Author Icon By Sharanya
Updated: May 18, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 మే 19వ తేదీ (రేపు) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మే 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థుల హాల్‌టికెట్లు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు వేలాది మంది విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు.

ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా ఒకేసారి

ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే 19 నుంచి 24 వరకు జరుగుతాయి. ఇది రెగ్యులర్ విద్యార్థులతో పాటు, చదువు మధ్యలో ఆపిన వారికీ తిరిగి అవకాశమిచ్చే విధంగా ఉండటం విశేషం. ఈ మేరకు ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ విద్యార్ధులందరూ పరీక్షలు బాగారాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించింది. పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పేపర్‌ లీకేజీలు జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరా నిఘాలో ఉంచారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, చరవాణులకు పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అన్నారు.

హాల్‌టికెట్లు ఇలా పొందొచ్చు

విద్యార్థులు తమ హాల్‌టికెట్లను క్రింది మార్గాల్లో పొందొచ్చు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్‌ 95523 00009 నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాఠశాలల ప్రిన్సిపాల్/హెడ్ మాస్టర్ నుండి పొందవచ్చు. ఓపెన్ స్కూల్ విద్యార్థులు తమ పేరుతో నమోదు చేసుకుని తమ హాల్‌టికెట్లను పొందవచ్చు.

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల 2025 పూర్తి టైం టేబుల్ ఇదే..

మే 19వ తేదీన ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 1
మే 20వ తేదీన సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
మే 21వ తేదీన ఇంగ్లీష్
మే 22వ తేదీన గణితం
మే 23వ తేదీన భౌతిక శాస్త్రం
మే 24వ తేదీన జీవ శాస్త్రం
మే 26వ తేదీన సామాజిక అధ్యయనాలు
మే 27వ తేదీన ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 2, OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ I
మే 28వ తేదీన OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 2, SSC ఒకేషనల్‌ కోర్సు

పరీక్ష సమయం

సప్లిమెంటరీ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరాలని సూచించబడింది.

2025 రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ఫలితాలను వెల్లడించారు. వీటి ఫలితాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. విద్యార్ధుల నుంచి మొత్తం 66,421 జవాబుపత్రాల దరఖాస్తులు రాగా ఇందులో 47,484 జవాబుపత్రాల ఫలితాలను విడుదల చేశామని అన్నారు.

Read also: Kodali Nani: మెరుగైన చికిత్స కోసం అమెరికాకు కొడాలి నాని?

#AP10thSupplementaryExams #APBoardExams #APEducationReforms #APSSC2025 #SSCReattempt #SupplementaryExams2025 Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.