📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sunil Naik: విచారణకు డుమ్మా కొట్టిన ఐపీఎస్ సునీల్ నాయక్

Author Icon By Saritha
Updated: March 12, 2026 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sunil Naik: ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వైసీపీ హయాంలో కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఏపీ హైకోర్టు ఆదేశించినప్పటికీ నేటి పోలీసు విచారణకు హాజరు కాలేదు.

Read Also: Neredmet crime: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Sunil Naik: IPS Sunil Naik who evaded the investigation

ఈ నెల 9 వరకు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇంతకు ముందు ఆదేశించింది. ఆ గడువు ముగియడం, సునీల్ నాయక్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ అర్హతపై హైకోర్టు వాదనలు వినడం ఆ రోజే జరిగిపోయాయి. అయితే, విచారణాధికారి అభ్యర్థన మేరకు విచారణ గడువును మార్చి 12 (ఈరోజు) వరకు పొడిగిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విధించిన గడువులో నేడు ఆఖరి రోజు అయినప్పటికీ, సునీల్ నాయక్ విచారణకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన గైర్హాజరుపై అటు పోలీసు వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP High Court IPS Sunil Nayak investigation Latest News in Telugu Raghu Rama Krishna Raju Case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.