📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Suman: సీఎం చంద్రబాబుపై సినీ నటుడు సుమన్ ప్రశంసలు

Author Icon By Sharanya
Updated: June 15, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై ప్రముఖ సినీనటుడు సుమన్ (Suman) తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు దార్శనిక నాయకుడిగా, ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో ఆయన వివరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి.

సుమన్ మాటల్లో చంద్రబాబు విశేషాలు:

చంద్రబాబు తన అనుభవంతో, దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని, ఆయన దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని అభిప్రాయపడ్డారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఒక విజనరీ. ఎలాంటి సంక్షోభం వచ్చినా పరిష్కరించగలిగిన సమర్థుడు చంద్రబాబు. దేశంలోనే నెంబర్ వన్ సీఎం ఎవరంటే చంద్రబాబే. దెబ్బతిన్న రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం అందుకు ప్రజలు కూడా సహకరించాలి. ఆయనకు కొంత సమయం ఇవ్వాలి. ఏది ముందు చెయ్యాలి, ఏది తర్వాత చెయ్యాలి అనే ప్రాధాన్యతలు ఉంటాయి… మనకు కావాల్సింది ఇప్పుడే జరగాలి అంటే కుదరదు అందుకోసం వేచిచూడాలి.

హైదరాబాద్ అభివృద్ధికి బాబు పెట్టిన బేస్:

చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. హైదరాబాద్ ను ఆయన అభివృద్ధి చేసిన తీరు అందుకు నిదర్శనం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ వచ్చారు కాదనడంలేదు కానీ హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి నిర్మాణాలతో ఒక ఆర్కిటెక్చర్ మ్యాప్ ను ఏర్పాటు చేసింది మాత్రం చంద్రబాబే.

“బాబుకి సమయం ఇవ్వండి – రాష్ట్రం మారుతుంది”

ఇవాళ ఏపీ అభివృద్ధి అంటే ఒక పరీక్ష వంటిది. దాదాపు ఎడారి వంటి ప్రాంతాన్ని సుభిక్షంగా తయారుచేయాలంటే ఆయనకు సమయం ఇవ్వాలి మనమందరం సహకరించాలి.

మనుషులు అన్న తర్వాత తప్పులు ఉంటాయి. ఎవరూ పర్ఫెక్ట్ కాదు. అయితే ఆ తప్పు పెద్దదా, చిన్నదా అనేది చూడాలి. పెద్ద తప్పు అయితే మాట్లాడాలి, చిన్న తప్పు అయితే పట్టించుకోకూడదు. గత ప్రభుత్వం తప్పులు చేయలేదా? వాళ్లు కొన్ని మంచి పనులు చేశారు, కొంత చెడు కూడా జరిగింది.

మోదీ సహకారం – బాబు విజన్: బెస్ట్ కాంబినేషన్

మనకు మోదీ గారి సహకారం ఉంది. ఆయన అండను వీలైనంతగా ఉపయోగించుకోవాలి” అని సుమన్ పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి బంగారు అవకాశం అని సుమన్ చెప్పారు.

Read also: Andhra Pradesh: ఈ నెల 21న విశాఖలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం

#APPolitics #cmchandrababu #SumanOnChandrababu #SumanSupport #VisionaryLeader Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.