📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Sullurpeta: పక్షులకు స్వాగతం పలుకుతూ అవగాహన ర్యాలీ

Author Icon By Saritha
Updated: January 8, 2026 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పక్షుల పండగకు స్వాగతం పలుకుతూ ఈ నెల 10, 11 తేదేలలో సూళ్లూరుపేటలో (Sullurpeta) ఫ్లెమింగో వేడుకల ను నిర్వహించుకోబోతున్నారు. ఈ పక్షుల పండుగను చాల పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురవారం ఉదయం స్థానిక ఎస్. వి యూనివర్సిటీ తారకరామ మైదానం నుండి నాలుగు కాళ్ళ మండపం వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షీ, పర్యాటక శాఖ ఆర్ డి రమణ ప్రసాద్, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ రమేష్ నాద్ లింగుంట్ల, జిల్లా విద్యా శాఖాధికారి కె.వి.ఎన్ కుమార్, సమగ్ర శిక్ష సిఎంఓ సురేష్, ఎంఈఓ బాలాజీ, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ర్యాలీ ని ప్రారంబించారు.

Read Also: Srikakulam accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

పులికాట్ సరస్సు తీరాన పక్షుల పండుగ సందడి

ఈ సందర్బంగా (Sullurpeta) జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాలో పులికాట్ సరస్సు తీరాన ఈ నెల 10, 11 తేదేలలో ఫ్లెమింగో వేడుకలకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. గత ఏడాది మూడు రోజులు పాటు ఘనంగా ఈ పక్షుల పండగ నిర్వహించామని, దాదాపు 3 నుండి 4 లక్షల పైన సందర్శకులు నేలపట్టు, అటకాని దిబ్బ, బివి పాల్యం బోటింగ్, సూళ్ళూరు పేటలో నిర్వహించానటువంటి వివిధ రకాల స్టాల్స్, ఆటల పోటీలు, ఫ్లెమింగో పక్షులు, నేలపట్టు కు వచ్చే అనేకమైన పక్షులు జాతులను గమనిస్తూ వాటిని, వాటి పర్యావరణాన్ని, ఎకో సిస్టంను పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ప్రజలకు, చుట్టుప్రక్కల నుండి వచ్చే సందర్శకులకు మంచి వాతావరణంలో నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ ఏడాది అంతకన్నా పెద్ద ఎత్తులో నిర్వహించాబోతున్నామన్నారు. సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా శ్రీ సిటీతో వర్క్ షాప్, పరిశ్రమలు స్టాల్స్, కార్యక్రమాలు నిర్వహించనున్నామని, ఎవరైతే జంతు, పక్షుల ప్రేమికులు ఉన్నారో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం వారికి రెండు రోజులు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

పండుగను వీక్షించేందుకు పిల్లలకు ఉచిత బస్సుల సౌకర్యం

మన జిల్లాకి సుమారు 42 శాతం అడవులు, జలపాతాలు ఉన్నాయని, ట్రెక్కింగ్ రూట్ ని ప్రమోట్ చేయడానికి ఈ ఏడాది ఉబ్బలమడుగు జలపాతాన్ని ఈ ఫెస్టివల్ లో తీసుకురావడం జరిగిందని తెలిపారు. నిన్న జరిగినటువంటి టూరిజం సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఐ ల్యాండ్ టూరిజం అభివృద్ధి చేయాలనీ , అందులో భాగంగా బివి పాల్యం నుండి ఇరక్కం ఐ ల్యాండ్ కి సర్క్యుట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. పిల్లల కోసం సుమారు 10,11 వ తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్శన కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. సందర్శకుల కోసం కొన్ని ప్రదేశాలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. బివి పాల్యంలో స్థానిక బోట్స్ మెన్ సొసైటీల చేయూత కోసం బోటింగ్ కొరకు మినిమల్ ఫీజ్ పెట్టడం జరిగిందని, వచ్చిన మొత్తాన్ని మత్స్యకారుల సంఘాలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. చాలా అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నామని తెలిపారు.

సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

నిఘా నేత్రం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించాబోతున్నామని, సి సి కెమరాలు, డ్రోన్ సహాయం తో క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మూమెంట్, ఎలాంటి సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తూ ఉంటామని తెలిపారు. స్థానిక శాసనసభ్యుడి ఆద్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. (Sullurpeta) వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ఒక మంచి వాతావరణంలో ఈ సారి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేశ్, దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమానికి 10,11 తేదీలలో ముఖ్య అతిధులుగా హాజరవుతారని తెలిపారు.

సందర్శకులు అందరు పులికాట్ సరస్సుకు విచ్చేసి ఫ్లెమింగ్ ఫెస్టివల్ ప్రభుత్వం నుండి ఆదిత్యాన్ని స్వీకరిస్తూ మంచి వాతావరణంలో నిర్వహించబోతున్నామని అందరు సందర్శించించి పక్షులను వీక్షించి టూరిజం పెంపొందించుటకు కృషి చేయాలని తెలిపారు. పెద్ద ఎత్తున ఫ్లెమింగో ఫెస్టివల్ ను టూరిజం ఇస్ ది బిగ్గెస్ట్ ఇజం అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతుంటారని, ఆయన మాటలను స్పూర్తిగా తీసుకొని టూరిజం అభివృద్ధి దిశగా కృషి చేస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తూ, సందర్శకులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొస్తూ.. జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ జి ఓ లను భాగస్వామ్యం చేసామని తెలిపారు. శ్రీ సిటీ, ఇండస్ట్రీస్, ఐఐటి, ఐజర్,పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఎస్. వి యూనివర్సిటీ ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో తీసుకేల్లెందుకు కృషి చేస్తామన్నారు…

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

BirdFestival FlamingoFestival FreeBusFacility Latest News in Telugu PulicatLake Telugu News TirupatiDistrict TourismDevelopment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.