📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Suicide: ఉదయం పెళ్లి రాత్రి వధువు ఆత్మహత్య.. ఎక్కడంటే..?

Author Icon By Ramya
Updated: August 5, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Suicide: పెళ్లంటే నూరేళ్లపంట అంటారు పెద్దలు. వధువు వరుడు పిల్లాపాపలతో వందేళ్లు జీవించాలని పెళ్లికి వచ్చినవారంతా దీవిస్తారు. ఆనందంగా బతకమని హితోపదేశం చేస్తారు. కష్టాలు, సమస్యలు ఏవి వచ్చినా ఇద్దరూ సర్దుకునిపోవాలని, కోపతాపాలు సహజమే కానీ, అవి బంధాలను విచ్చిన్నం చేసేంతగా పెంచుకోవద్దని తల్లిదండ్రులు అనురాగంతో చెబుతారు. తమ బిడ్డలు తమకళ్లముందు ఆనందంగా జీవించాలని కోటి ఆశలు, కోరికలతో తల్లిదండ్రులు లక్షలకు లక్షలు అప్పులు చేసి, తమ స్తోమతకు ఏమాత్రం తగ్గకుండా ఘనంగా పెళ్లి చేస్తారు. కానీ పెళ్లై పట్టుమని ఒక రోజైనా గడవకముందే ఆ నవవధువు ఆత్మహత్యకు (Suicide) పాల్పడితే ఆ కుటుంబ సభ్యుల వేదనను వర్ణించలేనిది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో నవవధువు ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన వరుడు నాగేంద్రతో (Nagendra) నిన్న (సోమవారం) ఉదయం ఘనంగా పెళ్లి జరిగింది.

Suicide

పెళ్లిరోజే విషాదం: ఫస్ట్ నైట్ గదిలో వధువు హర్షిత ఆత్మహత్య

అంగరంగ వైభవంగా హర్షిత, నాగేంద్ర వివాహంతో కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాల మధ్య ఉన్న క్షణాలు పెళ్లిరోజే ఆవిరి అయిపోయాయి. ఉదయం పెళ్లి, రాత్రి నవవధువు ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికంగా కలకలం రేపింది. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు నూతన దంపతులకు సోమందేపల్లిలో రాత్రి ఫస్ట్నెట్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే వరుడు నాగేంద్ర స్వీట్లు తీసుకునేందుకు బయటకు వెళ్లాడు. ఇటు పెళ్లి ఇంట్లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, వధువు హర్షిత శోభనం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలోకి వెళ్లిన హర్షిత ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టారు. ఫ్యానుకు వేలాడుతూ హర్షిత (Harshita) కనిపించేసరికి హుటాహుటిన కుటుంబ సభ్యులు పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే వధువు మరణించినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియదు కాగా హర్షిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియని పోలీసులు అంటున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వధువు ఆత్మహత్య చేసుకోవడంతో వరుడు నాగేంద్ర, అతని కుటుంబ సభ్యులు పెళ్లి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. హర్షిత కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పచ్చని తోరణాల మధ్య వధువు చావువార్త వినగానే ఆమె తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు.

హర్షిత ఏ సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది?

పెళ్లి జరిగిన అదే రోజు రాత్రి, శోభనం గదిలో హర్షిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

హర్షిత ఆత్మహత్యకు కారణాలు తెలిసాయా?

ప్రస్తుతం ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు, విచారణ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/krishna-district-unable-to-bear-the-harassment-of-her-husband-a-newlywed-commits-suicide/andhra-pradesh/525866/

Andhra Pradesh Breaking News bride suicide dowry death latest news newlywed tragedy Telugu News wedding tragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.